Ad
హీరో గోపిచంద్ వాళ్ల నాన్న తొట్టెంపూడి కృష్ణ. పుట్టింది వరంగల్ . సినిమాల మీద ఇష్టంతో డిగ్రీ అయ్యాక మద్రాస్ వెళ్లాడు. వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ సినిమాకు సంబంధించిన అన్ని రంగాల్లో అనుభవం సంపాదించుకున్నాడు. మద్రాస్ చేరగానే HM
రెడ్డి వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయ్యాడు. MV రాజన్ వద్ద ఎడిటింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. 30కి పైగా చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేసిన కృష్ణ తర్వాత డైరెక్షన్ లోకి దిగాడు.
Advertisement
ఎన్నో విజయవంతమైన సినిమాలను డైరెక్ట్ చేసిన కృష్ణ .. ఈ క్రమంలోనే ఈతరం అనే సొంత బ్యానర్ ను ప్రారంభించాడు . కొన్ని మలయాళ సినిమాలను కూడా డైరెక్ట్ చేశాడు.
కృష్ణ డైరెక్ట్ చేసిన సినిమాలు.
Advertisement
- ఉపాయంలో అపాయం
- నేటి భారతం
- దేశంలో దొంగలు పడ్డారు
- దేవాలయం
- వందేమాతరం
- ప్రతిఘటన
- రేపటి పౌరులు