Home » 37 ఏళ్లుగా MLA గా ఉన్న ఎర్ర బెల్లి దయాకర్ రావు ని ఓడించిన 26 ఏళ్ల యువతి యశస్విని రెడ్డి ఎవరంటే ?

37 ఏళ్లుగా MLA గా ఉన్న ఎర్ర బెల్లి దయాకర్ రావు ని ఓడించిన 26 ఏళ్ల యువతి యశస్విని రెడ్డి ఎవరంటే ?

by Srilakshmi Bharathi
Ad

తెలంగాణలో ఎన్నికల హడావిడి ముగిసింది. ఈ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చిన సంగతి తెలిసిందే. బిఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోయింది. అందరు అనుకోని ఫలితాలు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ సారి తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో చాలానే ట్విస్ట్ లు చోటు చేసుకున్నాయి.

Advertisement

అలాంటిదే ఈ ట్విస్ట్ కూడా. ఓ చోట 37 ఏళ్లుగా ఎమ్మల్యేగా ఉంటున్న ఎర్రబెల్లి దయాకర్ రావుకి ఓ 26 ఏళ్ల అమ్మాయి షాక్ ఇచ్చింది. 37 ఏళ్లుగా ఎమ్మల్యేగా ఉంటున్న ఆయన్ను ఓడించిన ఈ 26 ఏళ్ల యశస్వినీ రెడ్డి ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ మంత్రికి ఉన్న రాజకీయ అనుభవం అంత వయసు కూడా ఉండదు ఈ అమ్మాయికి. కానీ ఈ ఎన్నికల్లో గెలిచి చూపించింది. 37 ఏళ్లుగా ఎమ్మల్యేగా పోటీ చేస్తున్న.. అంటే 1985 నుంచి పోటీ చేస్తూ గెలుపొందుతున్న వ్యక్తికీ ఎదురెళ్లాలి అంటే.. ఆషామాషీ కాదు. బాగా పాపులారిటీ, సత్తా ఉన్న నేతలే వెనక్కి జంకుతారు. కానీ అటువంటి వ్యక్తిని ఎదుర్కొని ఓడించిన 26 ఏళ్ల యశస్వినీ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించారు. నిజానికి ఈ సీటు ఆమె అత్త ఝాన్సీ రాణికి రావాల్సింది. కానీ, ఆమె ఎన్నారై. భారత పౌరసత్వం లేకపోవడంతో పోటీ చేయడానికి ఇబ్బంది ఎదురైంది.

Advertisement

ఆమె పెట్టుకున్న పౌరసత్వ అప్లికేషన్ పై ఇప్పటి వరకూ స్పందన రాకపోవడంతో.. ఆమె స్థానంలో యశస్వినీ రెడ్డిని దింపారు. ఎర్రబెల్లిపై గెలవడం అనేది ఆషామాషీ వ్యవహారం ఏమీ కాదు. యశస్వినీ రెడ్డి పార్టీ టికెట్ వచ్చినప్పటి నుంచే ప్రజల్లో తిరుగుతూ.. ఎర్రబెల్లి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ప్రజలు ఎదుర్కొన్న ఇక్కట్ల గురించి చెప్పుకొచ్చారు. గట్టిగానే ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఫలితంగా విజయం ఆమె సొంతమైంది. ప్రజలు దీవిస్తేనే బలమైన నాయకులు అవుతారు అని ఆమె అభిప్రాయం చెప్పారు. ఆమె ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. అభిమానులు కూడా ఆమె ఇంటికి వచ్చి శుభాకాంక్షలు తెలిపారు.

తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading