సాధారణంగా ప్రస్తుతం టీ-20 మ్యాచ్ లకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వన్డే, టెస్ట్ మ్యాచ్ లను చూసేంత ఓపిక కూడా జనాలకు లేకుండా పోయిందనే చెప్పాలి. ఏదైనా చాాలా ఫాస్ట్ గా జరగాలని కోరుకుంటున్నారు జనం. ఇక టీ-20 మ్యాచ్ లు ప్రేక్షకులకు కావాల్సినంత మజాను కూడా ఇస్తాయి. ఇంగ్లాండ్ బ్యాట్స్ మన్ ప్రపంచంలోనే దాదాపు ప్రతీ లీగ్ లో తనదైన రికార్డులను సృష్టించాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్ లో అలెక్స్ హేల్స్ తుఫాన్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపిస్తున్నాడు.
Advertisement
అతడు ఒక మ్యాచ్ ను అయితే కేవలం 11.4 ఓవర్లలో అంటే 70 బంతుల్లో ముగించేశాడు. టీ-20 ఇంటర్నేషనల్ లో 70 సిక్సర్లు నమోదు చేసిన ఈ బ్యాట్స్ మెన్ కేవలం 70 బంతుల్లోనే జట్టును గెలుపు తీరాల్లో నిలిపాడు. బిగ్ బాష్ లీగ్ లో డిసెంబర్ 27న బ్రిస్బేన్ హీట్, సిడ్నీ థండర్స్ మధ్య ఓ మ్యాచ్ జరిగింది. ఇక ఈ మ్యాచ్ లో హేల్స్ సిడ్నీ థండర్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. హేల్స్ ఓపెనర్ గా వచ్చి తుఫాన్ ఇన్నింగ్స్ తో చెలరేగిపోయాడు.
Advertisement
Also Read : చర్మ క్యాన్సర్ ఎక్కువగా ఎవరికి వచ్చే అవకాశం ఉందో తెలుసా ?
కేవలం 11.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించాడు. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 121 పరుగుల విజయ లక్ష్యాన్ని విధించింది. సిడ్నీ థండర్స్ జట్టుకు బ్యాటర్స్ అలెక్స్ హేల్స్, మాథయూ గైక్స్ కలిసి కేవలం 70 బంతుల్లోనే మ్యాచ్ ని ముగించేశారు. ఈ మ్యాచ్ లో సిడ్నీ థండర్స్ 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. అలెక్స్ హేల్స్ 52 నిమిషాల్లో 36 బంతులకు 59 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్ లో 10 ఫోర్లు ఉన్నాయి. అటువైపు మాథ్యూ గైక్స్ 52 నిమిషాల్లో 34 బంతులకు 56 పరుగులు చేసాడు. అతని ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లున్నాయి.
Also Read : తెలంగాణ నిరుద్యోగులకు అలర్ట్.. నేటి నుంచి గ్రూప్ 4 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం… ఇలా అప్లై చేసుకోండి.