Home » LICలో 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..!

LICలో 300 అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలు.. నెలకు రూ.లక్షకుపైగా జీతం..!

by Bunty
Ad

 

నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది ఎల్‌ ఐసీ సంస్థ. తాజాగా ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్నయం తీసుకుంది. ఇందులో భాగంగానే, భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖకు చెందిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, 300 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

Advertisement

Advertisement

అలాగే అభ్యర్థుల వయసు జనవరి 1, 2023 నాటికి తప్పనిసరిగా 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే జనవరి 2, 1993 నుంచి జనవరి 1, 2002 మధ్య జన్మించిన వారు అర్హులు. రిజర్వేషన్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జనవరి 31, 2023వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులు రూ. 700 ఎస్సీ/ ఎస్టీ/ పిడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 85లు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.

రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ప్రిలిమ్స్ ఫిబ్రవరి 17, 20 తేదీల్లో జరుగుతుంది. మెయిన్స్ రాత పరీక్ష మార్చి 18న ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.53,600 నుంచి రూ.1,02,090ల వరకు జీతంగా చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్ లో చెక్ చేసుకోవచ్చు.

READ ALSO : అయ్యో పాపం..మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌కు అరుదైన వ్యాధి !

Visitors Are Also Reading