ఉపాధ్యాయులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా తీపి కబురు చెప్పింది. వారికి ఏడున్నర సంవత్సరాల తర్వాత పదోన్నతులు, నాలుగున్నర ఏళ్ల అనంతరం బదిలీలు కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది. ఈనెల 18 లేదా 19 తేదీల్లో అందుకు సంబంధించిన కాలపట్టికను జారీ చేయనుంది. రాష్ట్ర ఆర్థికశాఖమంత్రి హరీష్ రావు స్వగృహంలో తాజాగా ఆయనతో పాటు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తదితరులు ఉపాధ్యాయ సంఘాల ఐకాస నేతలతో సమావేశం అయ్యారు. మంత్రి
Advertisement
సబితా మాట్లాడుతూ బదిలీలు, పదోన్నతులు చేపట్టాలన్న శుభవార్త చెప్పేందుకే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం అయ్యామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 9,266 మందికి ప్రమోషన్స్ ఇవ్వబోతున్నామని మంత్రి సబిత ఇంద్రారెడ్డి అన్నారు. దీంతో రాష్ట్రంలో పదివేల ఖాళీలు ఏర్పడబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో తొమ్మిది వేల ఎస్ జి టి పోస్టులు, మరో వెయ్యి వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Advertisement
ఇప్పటికే 13 వేల పోస్టులు ఖాళీలు ఉన్నాయని ప్రభుత్వం చెప్పగా, పదోన్నతుల తర్వాత 10వేల పోస్టులు ఖాళీ కానున్నాయి. దీంతో మొత్తం 23 వేల పోస్టులు భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఒకేసారి మెగా మేళా నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తోందని చెబుతున్నారు. ఈ పోస్టులు మొత్తం డీఎస్సీ ద్వారానే భర్తీ చేయనున్నారు. బదిలీలు, ప్రమోషన్ల తర్వాత నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
read also : వామ్మో కొత్త బంగారు లోకం హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి..?