Home » IND Vs AUS WC 2023 : ఆస్ట్రేలియాదే ప్రపంచ కప్.. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్..!

IND Vs AUS WC 2023 : ఆస్ట్రేలియాదే ప్రపంచ కప్.. కోహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్..!

by Anji

భారత్ వేదిక వన్డే వరల్డ్ కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. 140 కోట్ల భారతీయ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. ముఖ్యంగా  కోట్లాది మంది భారతీయ అభిమానుల కల యొక్క చరిత్ర చెదిరింది. స్వదేశంలో ప్రపంచ కప్ ను సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలుగా మిగిలాయి.  టోర్నీ ప్రారంభం నుంచి వరుస విజయాలతో ఊపు మీదున్న రోహిత్ సేన కీలక మైన ఫైనల్ మ్యాచ్ లో విజయం సాధించలేక  బోల్తా పడింది. ఆదివారం ఆస్ట్రేలియా తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. టీమిండియా విధించిన 241 పరుగుల లక్ష్యాన్ని ఆసిస్ నాలుగు వికెట్లు మాత్రమే  కోల్పోయి ఛేదించింది.

దీంతో ఆరోసారి విశ్వవిజేతగా నిలిచింది ఆస్ట్రేలియా. ట్రేవిస్ హెడ్ భారీ సెంచరీలతో చెలరేగగా.. మార్నస్ లబూషేన్ అర్థ సెంచరీతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ 120 బంతుల్లో 137 పరుగులు చేశాడు.  వీరిద్దరూ  మూడో వికెట్ కు 194 పరుగులు జోడించి ఆస్ట్రేలియాను విజయ తీరాలకు చేర్చారు.  భారత బౌలర్లతో బుమ్రా 2 వికెట్లు తీయగా, షమీ ఒక వికెట్, సిరాజ్ ఒక వికెట్ పడగొట్టారు. అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ పేలవమైన బ్యాటింగ్ ను ప్రదర్షించింది. ఆస్ట్రేలియా బౌలర్ల దాటికి నిర్ణీత 50 ఓవర్లలో కేవలం 240 పరుగులు మాత్రమే చేయగలిగింది. కీలక బ్యాట్స్ మెన్స్ గిల్, శ్రేయస్ అయ్యర్ తక్కువ స్కోరే ఔట్ అయ్యారు. దీంతో భారత్ కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ (66) టాప్ స్కోరర్ గా నిలవగా.. విరాట్ కోహ్లీ (54), రోహిత్ శర్మ (47) పరుగులతో రాణించారు.

రాహుల్, కోహ్లీ, రోహిత్ ముగ్గురు మినహా మిగతా వారు అంతగా స్కోర్ చేయలేకపోయారు.  గిల్ (4), రవీంద్ర జనరేజా (9), సూర్య కుమార్ యాదవ్ (18), మహ్మద్ షమీ (6), జస్ ప్రీత్ బుమ్రా (1), కుల్ దీప్ యాదవ్ (10), మహ్మద్ సిరాజ్ (9) నిరాశపర్చారు.  సూర్యకుమార్ యాదవ్ క్రీజులో ఉన్నప్పటికీ అంతగా ఆడలేకపోయాడు.  ఆస్ట్రేలియా బౌలర్లలో స్టార్క్ మూడు కీలక వికెట్లు తీయగా.. హాజెల్ వుడ్,  కమిన్స్ తలా రెండు వికెట్లు తీశారు. మ్యాక్స్ వెల్ ఒక వికెట్ పడగొట్టాడు. చివరిలో  ట్రావిస్ హెడ్ ఔట్ కాగా.. మాక్స్ వెల్ వచ్చి విన్నింగ్ షాట్ కొట్టాడు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా  ట్రావిస్ హెడ్ నిలిచాడు. ఆస్ట్రేలియా  మొదటిసారి 1987లో ప్రపంచకప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత 1999, 2003, 2007, 2015లలో కూడా ఛాంపియన్ గా నిలిచింది. ఇప్పుడు ఆరోసారి ప్రపంచ కప్ ను ఖాతాలో వేసుకుంది. ఈ వరల్డ్ కప్ లో టీమిండియా బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీకి ప్రపంచ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ లభించింది. ఈ వరల్డ్ కప్ లో కోహ్లీ 765 పరుగులు సాధించి రికార్డు సృష్టించాడు. ప్రపంచ కప్ ఫైనల్ లో భారత్ పై ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

మరిన్ని  క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి !  తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.

Visitors Are Also Reading