Home » 2022:జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్.. చివరి తేది ఎప్పుడంటే..?

2022:జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్.. చివరి తేది ఎప్పుడంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మరియు బిఈ కోర్సుల్లో ప్రవేశం కొరకు నిర్వహించే జేఈఈ మెయిన్ 2022 మొదటి సెషన్ దరఖాస్తు గడువు( ఏప్రిల్ 25 2022 ) సోమవారంతో ముగియనుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు2022 జూన్ సేసను కొరకు అధికారిక వెబ్సైట్ jeemain. nta. nic.in లోనికి వెళ్ళాలి. హోం పేజీలోకి వెళ్లి రిజిస్ట్రేషన్ జేఈఈ మెయిన్ అనే లింకు పై క్లిక్ చేయాలి. వెంటనే అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ నమోదు చేసి లాగిన్ కావాలి. ఆ తర్వాత జేఈఈ-మెయిన్

Advertisement

Advertisement

2022 ఫారం పూర్తి చేసి దానికి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. తర్వాత ఫీజు చెల్లించి, ఆ ఫామ్స్ సబ్మిట్ చేయాలి. తర్వాత ఆ ఫామ్ ను ప్రింట్ తీసుకోవడానికి డౌన్లోడ్ చేయాలి. అయితే దీనికి జేఈఈ మెయిన్ లో ఫస్ట్ సేసన్ రిజిస్ట్రేషన్ కొరకు అందుబాటులో ఉన్నటువంటి లింకును అభ్యర్థులు క్లిక్ చేయవచ్చు. ఇందులో జనరల్ కేటగిరీ విద్యార్థులకైతే పీజు 600 రూపాయలు, మిగతా అన్ని కేటగిరీల స్టూడెంట్స్ కి 325 రూపాయల పేమెంట్ చెల్లించాలి. పేమెంట్ ప్రాసెస్ కోసం

నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే సోమవారం రాత్రి 9 గంటల వరకు మాత్రమే జేఈఈ-మెయిన్ 2022 మొదటి సెషన్ పూర్తవుతుంది. 9 గంటల లోపు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఫీజు చెల్లించడం కోసం 11.50 నిమిషాల వరకు సమయం ఉంటుంది. అయితే మొదటి సెషన్ పరీక్షలు జూన్ 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరుగుతాయి.

Visitors Are Also Reading