Home » ఓటిటిలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’ – ఎప్పుడు? ఎక్కడ? అంటే…

ఓటిటిలోకి రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘2018’ – ఎప్పుడు? ఎక్కడ? అంటే…

by Bunty
Ad

టోవినో థామస్… గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా థామస్ నటించిన సినిమా 2018. ఈ చిత్రం తెలుగులో డబ్ అయ్యి రిలీజ్ అయింది. డబ్బింగ్ చిత్రమైన కలెక్షన్లలో దూసుకెళ్లింది. తాజాగా శుక్రవారం విడుదలైన 2018 సినిమాకు కూడా తెలుగులో అదే స్థాయిలో ఆదరణ దక్కుతుంది. మూడు వారాల క్రితం మలయాళంలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన 2018 సినిమా శుక్రవారం తెలుగులో విడుదలైంది.

Advertisement

బన్నీ వాసు ఈ సినిమాను తెలుగులో విడుదల చేశాడు. రిలీజ్ కు ముందు ఒక ప్రెస్ మీట్ తప్పితే పెద్దగా ప్రమోషన్లు గట్రా చేయలేదు. అయినా ఈ సినిమా తొలి రోజే తుఫాన్ లాంటి కలెక్షన్లు సాధించింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. 2018 ఓటిటి రైట్స్ ను సోనీలివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. జూన్ 7వ తేదీ నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సోనీలీవ్ యాప్ లో ఇందుకు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు.

Advertisement

మలయాళ సినీ చరిత్రలో రూ. 150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన చిత్రంగా 2018 నిలిచింది. కాగా, ఇక పోటీగా రిలీజ్ అయిన మేము ఫేమస్, మళ్లీ పెళ్లి వంటి తెలుగు సినిమాలు కూడా ఆ స్థాయిలో కలెక్షన్లు సాధించలేవు. దీన్ని బట్టి చూస్తే కంటెంట్ తో వస్తే కలెక్షన్లకు అడ్డేది అర్థమవుతుంది. టీవీనో థామస్, కుంజుకో బాబిన్, అపర్ణ బాలమురళి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఇటీవలే మోహన్ లాల్ పులి మురుగన్ కలెక్షన్లను బీట్ చేసి మలయాళ కొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..

ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

‘అత్తారింటికి దారేది’ లోని ఈ సన్నివేశంలో వెనుక నిల్చున్న వ్యక్తి ఎవరో తెలుసా !

Visitors Are Also Reading