Home » 18 Pages OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో 18 పేజెస్.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే!

18 Pages OTT: ఒకేసారి రెండు ఓటీటీల్లో 18 పేజెస్.. ఎప్పుడు రిలీజ్ కాబోతుందంటే!

by Bunty
Ad

డిసెంబర్ 23న రిలీజ్ అయ్యి మంచి టాక్ తో దూసుకుపోయిన మూవీ 18 పేజెస్. నిఖిల్ హీరోగా, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా చేసిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు. మొదటి రోజు బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను పూర్తి చేసి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే, ఈ సినిమాను జిఏ 2 పిక్చర్స్ సుకుమార్ రైటింగ్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన విషయం మన అందరికీ తెలుసు.

Advertisement

 

ఈ సినిమా బడ్జెట్ దాదాపుగా 18 కోట్లకు వచ్చిందట. ఈ తరుణంలోనే 20 కోట్లకు పైగా వసూలు రాబట్టినట్టు సమాచారం.ఇక ఇప్పటిదాకా థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. అది కూడా ఒకటి, ఒకే రోజు రెండు ఓటీటీలోకి విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఆహా దక్కించుకున్న సంగతి తెలిసిందే.

Advertisement

ఇక ఇప్పుడు తాజాగా మరో ఓటిటి దిగ్గజం నెట్ ఫ్లిక్స్ 18 పేజెస్ మూవీ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఈ రెండు ఓటిటిల్లో జనవరి 27 నుంచి మూవీ స్ట్రీమింగ్ కానుంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇవాళ వచ్చింది. కాగా, ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా, బన్నీ వాసు నిర్మించారు. అలాగే దర్శకుడు సుకుమార్ కథను అందించిన సంగతి తెలిసిందే. మ్యూజిక్ డైరెక్టర్ గోపి సుందర్ ఈ మూవీకి బాణీలు అందించాడు.

READ ALSO : ఈ 5 లక్షణాలుండే అబ్బాయిలను అమ్మాయిలుగా బాగా ఇష్టపడతారట..3వది చాలా ముఖ్యం

Visitors Are Also Reading