Home » ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌…గ్రామ, వార్డు సచివాలయాల్లో 15వేల పోస్టులు..వివరాలు ఇవే

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌…గ్రామ, వార్డు సచివాలయాల్లో 15వేల పోస్టులు..వివరాలు ఇవే

by Bunty
Ad

ఏపీలోని నిరుద్యోగులకు బిగ్ అలర్ట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు భరోసా కేంద్రాలను మరింత బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఆర్బీకేల పరిధిలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి సందర్భంగా ఏపీ నిరుద్యోగులకు సర్కారు గొప్ప శుభవార్తను అందించింది.

Advertisement

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీగా ఉన్నా 15 వేలకు పైగా పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వెలువరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే వీటికి సంబంధించి అనుమతులను జారీ చేసింది సర్కారు.

Advertisement


వార్డు, సచివాలయాల్లో పోస్టుల వివరాలు,

  • పశుసంవర్ధక శాఖ-4,765
    హార్టికల్చర్ అసిస్టెంట్-1005
    విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్-990
    ఇంజనీరింగ్ అసిస్టెంట్-982
    డిజిటల్ అసిస్టెంట్-736 పోస్టులు ఉన్నాయి.

ఈ పోస్టులు మొత్తం 14,253 పోస్టులు ఉన్నాయి. అయితే, మరిన్ని పోస్టులు వీటికి జత కానున్నాయి.  అంటే 15వేలకు చేరనున్నాయి. వచ్చే నెలలో వీటి నోటిఫికేషన్‌ విడుదల కానుంది. అటు రైతు భరోసా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 4,765 పశుసంవర్ధక సహాయక పోస్టుల భర్తీకి అనుమతిస్తూ రెండు రోజుల కిందట స్పెషల్ చీఫ్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి అధికారిక ఉత్తర్వులు ఇచ్చిన సంగతి తెలిసిందే.

READ ALSO : పవన్ కళ్యాణ్ పొలిటికల్ జోకర్..నాగబాబు బుర్రలేని మనిషి – రోజా

Visitors Are Also Reading