Home » మన్సూర్ అలీ ఖాన్ ఆస్తుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

మన్సూర్ అలీ ఖాన్ ఆస్తుల గురించి తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..!

by Anji
Ad

మన్సూర్ అలీ ఖాన్ పేరు ఇంతకు ముందు ఎవ్వరికీ పెద్దగా పరిచయం లేదు. కానీ  ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇదే పేరు హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే..  తాజాగా ఆయన లోకేష్ కనకరాజు, విజయ్ దళపతి కాంబినేషన్ లో వచ్చిన లియో సినిమాలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.  ఇందులో హీరోయిన్ గా త్రిష నటించింది. అయితే ఓ ఇంటర్వ్యూలో మన్సూర్ అలీఖాన్ త్రిషను ఉద్దేశిస్తూ… ‘త్రిష తో ఈ సినిమాలో నాకు బెడ్ రూమ్ లోకి ఎత్తుకెళ్లి రేప్ చేసే సన్నివేశం ఉంటుందని అనుకున్నాను.. కానీ అది జరగలేదు.. దీనికి నేను చింతిస్తున్నాను’ అంటూ ఆయన పబ్లిక్ గా కామెంట్లు చేయడం పలు సంచలనాలకు దారితీసింది.

Advertisement

ఈ విషయంపై త్రిష స్పందిస్తూ ఇలాంటి అహంకారపూరితమైన వ్యక్తితో పనిచేయడం నిజంగా నా దురదృష్టం ఇకపై అతడితో ఒక్క సినిమా కూడా చేయను అంటూ చెప్పింది. ఇక దీనిపై స్పందించిన ఫిలిం ఇండస్ట్రీ త్రిషకి మద్దతుగా మన్సూర్ అలీఖాన్ పై పూర్తిస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల గురించి మన్సూర్ అలీ ఖాన్ తప్పుడుగా వ్యాఖ్యలు చేయడం ప్రతి ఒక్కరికి ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. ఇంత యాటిట్యూడ్ ఉన్న వ్యక్తికి ఇంకా ఇండస్ట్రీ సపోర్ట్ చేయడం ఏమిటి అని చాలామంది నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలోనే మన్సూర్ అలీ ఖాన్ కి సంబంధించిన ఎన్నో విషయాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో భాగంగా ఆయన ఆస్తులు, స్థిరచరాస్తులు ఎన్ని కోట్లు.. ఆయన కారు కలెక్షన్.. ఇలా ప్రతి ఒక్కటి కూడా నెట్టింట వైరల్ అవుతుండడం గమనార్హం.

Advertisement

ఇకపోతే మన్సూర్ అలీ ఖాన్ లగ్జరీ లైఫ్ విషయానికి వస్తే ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.30 – 40 లక్షలు పారితోషకం అందుకుంటాడు. తాజాగా తాను నటించిన లియో చిత్రానికి గాను రూ.50 లక్షల పారితోషకం తీసుకున్నట్లు సమాచారం. ఒకానొక సమయంలో హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించి పేరు దక్కించుకున్న ఈయన ఇప్పుడు విలన్ గా మరింత పాపులారిటీ దక్కించుకున్నారు. కోలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా పేరు దక్కించుకున్న మన్సూర్ అలీఖాన్ ప్రాపర్టీ విషయానికి వస్తే.. సుమారుగా రూ. 400 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం.  మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్ , బీఎండబ్ల్యూ M4, ఆడి Q5, టయోటా ఫార్చునర్, వంటి ఖరీదైన లగ్జరీ కార్లు ఆయన సొంతం. అలాగే చెన్నైలో అత్యంత విలాసవంతమైన లగ్జరీ ఇల్లు కూడా ఉంది. ఇకపోతే ఈయన ఆస్తులు చరాస్తులు విషయం పక్కన పెడితే మన్సూర్ అలీఖాన్ పై కేసులు కూడా నమోదు కావడం గమనార్హం.

మరిన్ని టాలీవుడ్ న్యూస్  కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading