Home » కీర్తి సురేష్ మొదటి పారితోషకం ఎంతో తెలుసా ?

కీర్తి సురేష్ మొదటి పారితోషకం ఎంతో తెలుసా ?

by Anji
Ad

టాలీవుడ్ హీరోయిన్ కీర్తి సురేష్ అనగానే టక్కున గుర్తుకువచ్చే విషయం అలనాటి సావిత్రి గారి జీరాక్స్ కాపీ. మహానటి సినిమాతో సామిత్రి పాత్రకు 100 శాతం న్యాయం చేసి శభాష్ అనిపించుకుంది. అంతకు ముందు పలు సినిమాలు చేసినప్పటికీ మహానటి చిత్రం మాత్రం కీర్తి సురేష్ కి సెన్షేషనల్ క్రేజ్ ని తీసుకొచ్చింది. ఈ చిత్రంతో జాతీయ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది కీర్తి.  జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం కూడా అందుకుంది. ఈ సినిమా తరువాత తన క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని  రెమ్యునరేషన్ కూడా పెంచేసిందని టాక్.  ప్రస్తుతం కీర్తి సురేష్ దాదాపు రూ.2కోట్ల వరకు డిమాండ్ చేస్తుందని టాక్. 

Advertisement

కీర్తి సురేష్ తల్లి మేనక హీరోయిన్ కాగా.. తండ్రి సురేష్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ని ప్రారంభించింది కీర్తి సురేష్. అప్పట్లో తాను నటించిన పాత్రలకు ఎంత డబ్బు ఇచ్చారో కూడా తెలియదు అని చెప్పింది. నిర్మాతలు ఇచ్చిన డబ్బుని తన తండ్రికి ఇచ్చేదానిని అని, తనకి ఊహా తెలిసిన తరువాత రూ.1500 పారితోషికం తీసుకున్నట్టు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా నిర్మాతలు తన రెమ్యూనరేషన్ ని కవర్ లో పెట్టించి ఇచ్చేవారని.. దానిని నేరుగా తీసుకొని నాన్నకు అప్పగించే దానిని అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది కీర్తి సురేష్. ఇప్పటికీ కూడా తనకు వచ్చిన పారితోషికాన్ని తండ్రికి ఇస్తున్నారంటే నిజంగా కీర్తి సురేష్ చాలా గ్రేట్ అంటూ ఆమెపై పలువురు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

Advertisement

Also Read :  అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

Manam

ప్రస్తుతం తమిళం, తెలుగు, మలయాళం, తెలుగు ఇలా పలు భాషల్లో నటిస్తూ తన సత్తా చాటుతోంది కీర్తి సురేష్. 2016లో టాలీవుడ్ హీరో రామ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నేను శైలజ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది కీర్తి సురేష్. ఆ తరువాత నేను లోకల్, మహానటి, రంగ్ దే, సర్కారు వారి పాట వంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఓ మూడు సినిమాలున్నాయి. నాని హీరోగా నటించిన దసరా, మెగాస్టార్ చిరంజీవి భోళోశంకర్, రెండు జెళ్ళ సీత సినిమాలో నటిస్తోంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ రెండు జెళ్ళ సీత చిత్రంలో నవీన్ విజయ్, కీర్తి సురేష్ జంటగా నటించనున్నారు. ఈ చిత్రం జులై 14, 2023న విడుదల కానుంది. మరోవైపు కీర్తి సురేష్ బాలీవుడ్ కి మకాం మార్చుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వాస్తవం ఎంత అనేది మాత్రం తెలియదు. 

Also Read :  బంగారం లాంటి భార్య‌ను ఇంట్లో పెట్టుకుని భ‌ర్త పాడుప‌నులు…త‌ట్టుకోలేక భార్య ఏం చేసిందంటే..?

Visitors Are Also Reading