Telugu News » Blog » అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్ని సినిమాల్లో నటించాడో తెలుసా ?

by Anji
Ads

టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన అల్లు అర్జున్ ఇటీవల నటించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు.. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అనే బిరుదు రావడం విశేషం. క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ పనులు కొనసాగుతున్నాయి. గంగోత్రి సినిమాతో హీరోగా పరిచయమైన  అల్లు అర్జున్  ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇప్పుడూ పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయాడు. అయితే అల్లు అర్జున్ హీరోగా నటించడం కంటే ముందే కొన్ని సినిమాల్లో నటించారు. మరికొన్ని సినిమాల్లో బాలనటుడిగా కూడా నటించారు. ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Advertisement

Advertisement

బన్నీ బాల నటుడిగా నటించిన సినిమాలు సూపర్ హిట్ నిలవడం విశేషం. ఇక ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్, తరుణ్, మహేష్ బాబు లాంటి వారే బాలనటులుగా నటించినట్టు అందరికీ తెలుసు. మహేష్ బాబు కృష్ణ నటించిన చాలా సినిమాల్లో నటించి మెప్పించారు. అదేవిధంగా తరుణ్ అయితే ఏకంగా 20 సినిమాల్లో బాలనటుడిగా నటించారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ కూడా బ్రహ్మ శ్రీ విశ్వామిత్ర, బాల రామాయణం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించారు. 

Also Read :  న‌టి భానుప్రియ జీవితంలో ఇంతటి విషాదం ఉందా..? సొంత ఇల్లు లేక చివ‌ర‌కి..?

Allu Arjun : Manam News

ఇక అల్లు అర్జున్ రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఒకటి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన విజేత సినిమా కాగా.. మరొకటి తమిళ హీరో కమలహాసన్ హీరోగా నటించిన స్వాతిముత్యం సినిమాలో అల్లు అర్జున్ కమలహాసన్ మనవడిగా నటించి మెప్పించారు. అల్లు అర్జున్ హీరోగా పరిచయం కాకముందే చిరంజీవి నటించిన డాడీ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా మారారు. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ అల్లు అర్జున్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడని తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Also Read :   నమ్రతా పెళ్లి విషయంలో కృష్ణ మహేష్ బాబును అడిగిన ఒకే ఒక ప్రశ్న.. ఏంటంటే..?