రాజస్థాన్‌కు చెందిన ఆదిత్య శర్మ ఎప్పటి మాదిరిగానే ఫుడ్ ఆర్డర్ చేసాడు. కాసేపటికే డెలివరీ బాయ్ ఇంటి వద్దకు ఫుడ్ తీసుకొని వచ్చినట్టు సందేశం వచ్చింది. బయటకు వెళ్లి చూడగా షాక్ తిన్నాడు. పట్టపగలు అసలే ఎండాకాలం కావడం.. అందులో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఒక వ్యక్తి సైకిల్ మీద ఆర్డర్ తీసుకొని వచ్చాడు. సైకిల్ మీద వచ్చినా కానీ సమయానికే వచ్చాడు. కానీ ఆ వ్యక్తిని చూస్తే మాత్రం ఉన్నత చదువే చదువుకున్నట్టు కనిపించాడు. డెలివరీ తీసుకొని అతన్ని మాటల్లో పెట్టాడు.
కరోనా మహమ్మారి ఎంత మంది జీవితాలను అల్లకల్లోలం చేసిందో ఆ డెలివరీ బాయ్ గురించి తెలుసుకుని బాధపడ్డారు. రాజస్థాన్‌కు చెందిన దుర్గమీన (31) గతంలో ప్రయివేటు టీచర్‌గా పని చేసేవాడు. దాదాపు 12 సంవత్సరాల పాటు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అతను కరోనా లాక్‌డౌన్ సమయంలో ఉద్యోగం కోల్పోయాడు. నిరుపేద అయిన అతను కనీసం ఆన్‌లైన్ తరగతులు చెబుదామనుకున్నా ట్యాబ్ లేక జొమాటోలో జాయిన్ అయ్యాడు. ఫుడ్ డెలీవరీలు చేస్తూ నెలకు రూ.10వేల వరకు సంపాదిస్తున్నాడు.
ప్రతి రోజు ఇలా సైకిల్‌పై తిరుగుతుండడంతో ఎంత కష్టపడ్డా 10 నుంచి 12 డెలివరీల కంటే ఎక్కువ చేయలేకపోతున్నాడు. దీంతో బైకుకొనాలని భావించినా కనీసం డౌన్ పేమెంట్‌కు కూడా డబ్బులు లేవు. దీంతో ప్రతినెల కొంచెం డబ్బులు కూడబెడుతున్నట్టు ఆ కస్టమర్‌కు చెప్పాడు. వీలుంటే డౌన్ పేమెంట్‌కు డబ్బులు ఆరెంజ్ చేస్తే.. నెలనెల తీర్చేస్తానని చెప్పుకొచ్చాడు. దుర్గ మీన బాధ విన్న ఆదిత్య శర్మ అతని స్టోరీని ట్విట్టర్లో పోస్ట్ చేశాడు.
ఇక అవసరమైతే అందరం కలిసి అతడిఇ బైకు కొనిద్దామంటూ క్రౌడ్ ఫండ్ స్టార్ట్ చేశాడు. అతడి పోస్టుకు ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చింది. నాలుగు గంటల్లోనే రూ.75వేలు సమకూరాయి. దీంతో అతనికి అప్పటికప్పుడు హీరో బైకు కొనిచ్చాడు. అనుకొని ఈ సంఘటనకు దుర్గ మీన కన్నీటి పర్వంతం అయ్యాడు. ఆదిత్య దేవుడిలాగా వచ్చి ఆదుకున్నాడని అతడిని హగ్ చేసుకున్నాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
BEAST REVIEW : విజయ్ బీస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్….!
ఈ 6 స్టార్ హీరోల సినిమాలు టాలీవుడ్ లోనే అతిపెద్ద డిజాస్టర్ లు…!