రఫ్యా- ఉక్రెయిన్ మధ్య వార్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఓ అమెరికా టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. రష్యా దాడుల్లో ఉక్రెయిన్ నగరాలు దారుణంగా దెబ్బతిన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉక్రెయిన్ రాజధాని నగరమైనటువంటి కీవ్ గుర్తు పట్టలేనట్టు తయారు అయిందని తీవ్ర ఆవేదనతో చెప్పాడు. రాజధాని కీవ్‌పైనే కాదు.. శివారు ప్రాంతాల్లో కూడా జనవాస ప్రాంతాలపై బాంబులు వేస్తోందని జెలెన్ స్కీ ఆరోపించారు.
Advertisement
Advertisement
రష్యా దళాలు తమ నగరాలను ఆక్రమించుకున్నప్పటికీ ఉక్రెయిన్ ప్రజలు ఎదురొడ్డి పోరాడుతున్నారు అని, ఇది ఎంతకాలం కొనసాగుతుందని ప్రశ్నార్థకమని పేర్కొన్నారు. పాశ్చాత్యదేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు ఇవ్వాలని జెలెన్ స్కీ మరొకసారి విజ్ఞప్తి చేశారు. రష్యా తన ఫైటర్ జెట్లు, పోరాట హెలికాప్టర్ లను ఉక్రెయిన్ గగన తలం నుంచి దాడులు చేయకుండా నిషేదించాలని, నో ఫ్లై జోన్ ప్రకటించడంపై పాశ్చాత్య దేశాలు మరొకసారి ఆలోచించాలని కోరారు.
Also Read : తక్కువ సమయంలో 25 మిలియన్ వ్యూస్ దాటిన టాప్ 5 సౌత్ ఇండియా సినిమాలు ఇవే..!