Telugu News » Blog » డేరాబాబాకు జ‌డ్ ప్ల‌స్ సెక్యురిటీ..ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు..!

డేరాబాబాకు జ‌డ్ ప్ల‌స్ సెక్యురిటీ..ప్ర‌భుత్వం కీల‌క ఉత్త‌ర్వులు..!

by AJAY

ప‌లు కేసుల్లో నింధితుడిగా తేలిన డేరా బాబా ప్ర‌స్తుతం యావ‌ర్జీవ కారాగార శిక్ష అనుభ‌విస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు డేరా బాబాకు జ‌డ్ ప్ల‌స్ క్యాట‌గిరీ బ‌ద్ర‌ను క‌ల్పించారు. ఈ మేర‌కు హ‌ర్యానా ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుని మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా డేరా బాబా ఇటీవ‌ల పెరోల్ పై విడుద‌లయ్యారు. పంజాబ్ ఎన్నిక‌ల స‌మయంలో జైలు నుండి బ‌య‌ట‌కు వ‌చ్చిన డేరా బాబాను ఖ‌లిస్థానీ తీవ్ర‌వాదులు టార్గెట్ చేశార‌ని వార్త‌లు వచ్చాయి.

దాంతో హ‌ర్యానా ప్ర‌భుత్వం డేరా బాబాకు జ‌డ్ ప్ల‌స్ భ‌ద్ర‌త క‌ల్పిస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండ‌గా డేరాబాబా ఎప్ప‌టి నుండో పెరోల్ కోసం అభ్య‌ర్థిస్తున్నారు. కానీ స‌రిగ్గా పంజాబ్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఆయ‌న అభ్య‌ర్థ‌న‌ను మ‌న్నించారు. ఇదిలా ఉండ‌గా హంత‌కుడు రేపిస్ట్ అయిన డేరా బాబాను జైలు నుండి బ‌య‌ట‌కు వ‌ద‌ల‌డం పైనే తీవ్ర‌విమ‌ర్శ‌లు రాగా ఇప్పుడు ఆయ‌న‌కు జెడ్ ప్ల‌స్ సెక్యురిటీ క‌ల్పించి మ‌రోసారి ప్ర‌భుత్వం విమ‌ర్శ‌ల పాలు అవుతోంది.

You may also like