భారత మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ సచిన్ టెండూల్కర్ కు వీరాభిమాని అనే విషయం అందరికి తెలిసిందే. ఓసారి ఏకంగా గ్రౌండ్ లోనే సచిన్ కాళ్ళు కూడా పట్టుకునాడు యువీ. కానీ ఇప్పుడు మాత్రం సచిన్ కారణంగా నేను చాలాసార్లు ఔట్ అయ్యాను అని అంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నాడు యువరాజ్.
Advertisement
అయితే తాజాగా యువీ మాట్లాడుతూ.. నేను చిన్నపాటి నుండి ఫాస్ట్ బౌలింగ్ ను ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను. అందుకే ఆసీస్, సౌత్ ఆఫ్రికా పిచ్ ల పైన బాగా బ్యాటింగ్ చేసేవాడిని. ఎలాంటి ఫాస్ట్ బౌలింగ్ నైన సరే ఎదుర్కునే ధైర్యం నాకు ఉంది. కానీ స్పిన్ బౌలింగ్ లో కష్ట పడేవాడిని. ముఖ్యంగా ముత్తయ్య మురళీధరన్ నన్ను చాలా ఇబ్బంది పెట్టేవాడు.
Advertisement
ఈ విషయం పైనే నేను సచిన్ తో చర్చించారు. ఎందుకంటే సచిన్ కు మురళీధరన్ బౌలింగ్ పైన పట్టుంది. అప్పుడు సచిన్ నాకు స్వీప్ షాట్స్ ఆడటం నేర్చుకోమని చెప్పను. దాంతో నేను ఈ స్వీప్ షాట్స్ ఆడటం కోసం ప్రయత్నించి చాలాసార్లు ఔట్ అయ్యాను. కానీ ఆ తర్వాత నేను ఇదే స్వీప్ షాట్ బాగా ఆడటం నేర్చుకొని బౌలర్లపైన ఆధిపత్యం చెలాయించాను అని యువీ పేర్కొన్నాడు.
ఇవి కూడా చదవండి :
వచ్చే ఐపీఎల్ లో ధోని ఆడుతాడా…?
పృథ్వీ షాకు జరిమానా.. ఎందుకంటే..?