Home » పృథ్వీ షాకు జరిమానా.. ఎందుకంటే..?

పృథ్వీ షాకు జరిమానా.. ఎందుకంటే..?

by Azhar
Ad
ఐపీఎల్ 2022 సీజన్ లో ఆటగాళ్లకు ఈ మధ్య జరిమానాలు ఎక్కువగా పడుతున్నాయి. ముఖ్యంగా జట్ల కెప్టెన్ లకు స్లో ఓవర్ రేట్ కింద ఫైన్స్ పడుతుంటే… ఆటగాళ్లకు మాత్రం ఐపీఎల్ నియమావలను ఉల్లఘించినందుకు జరిమానాలు వేస్తుంది ఐపీఎల్ కమిటీ. కానీ వారికీ ఎందుకు జరిమానాలు వేస్తున్నాము అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు తాజాగా ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా చేరిపోయాడు.
నిన్న లక్నో, ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ అనంతరం షాకు మచ్ ఫీజులో 25 శాతం జారిమానా విధిస్తున్నట్లు ఐపీఎల్ కమిటీ పేర్కొంది. షా చేసిన తప్పు లెవల్ 1 గా ధృవీకరించిన ఐపీఎల్ కమిటీ పృథ్వీ షాకు జరిమానా విధించింది కానీ.. ఎప్పటిలాగే పృథ్వీ షా చేసిన తప్పు ఏంటి అనే విషయాన్ని మాత్రం ప్రకటించలేదు.
అయితే ఐపీఎల్ 2022 మెగవేలం ముందు పృథ్వీ షాను ఢిల్లీ 7.50 కోట్లకు రిటైన్ చేసుకుంది. అంటే అతనికి ఒక్కో మ్యాచ్ కు 53 లక్షలు అందుతుండగా.. అందులో 25 శాతం అంటే షాకు 13.50 లక్షలు జరిమానా పడనుంది. ఇదిలా ఉంటె.. ఈ ఐపీఎల్ లో షా నిలకడగా రాణించలేకపోతున్నాడు. వార్నర్ తో పాటు ఓపెనర్ గా వస్తున్న షా ఓ మ్యాచ్ ఆడుతుంటే.. మరో మ్యాచ్ ఆడటం లేదు. ఇప్పుడు ఢిల్లీ జట్టుకు ఇదో తలనొప్పిగా మారింది.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading