భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ యువరాజ్‌సింగ్ ఫాదర్స్ డే స్పెషల్ గా తన కొడుకును అభిమానులకు పరిచయం చేసాడు. యువరాజ్ భార్య హేజల్ కీచ్ జనవరి 26న మగబిడ్డకు జన్మనిచ్చిన విషయం విధితమే. ఆ తరువాత ఆరు నెలలకు కొడుకుకి ఓరియన్ కీచ్‌సింగ్ అని పేరు పెట్టారు. ఇక యువీ, కీచ్ జంట వెల్‌కమ్ టుది వరల్డ్ ఓరియన్ కీచ్ సింగ్ మమ్మీ, డాడీ నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు. నువ్వు ఎప్పుడు నవ్విస్తూ ఉండాలని సోషల్ మీడియాలో రాసుకొచ్చిన యువరాజ్‌సింగ్ కొడుకు ఫోటోలను షేర్ చేశాడు.
యువీ 17 ఏళ్ల కాలం పాటు అంతర్జాతీయ కెరీర్‌లో 402 మ్యాచ్‌లను ఆడాడు. 11, 778 పరుగులు చేసి తన కెరీర్‌లో 17 సెంచరీలు, 71 అర్థసెంచరీలున్నాయి. స్పిన్ ఆల్‌రౌండర్ గ అదరగొట్టిన యువరాజ్, తన కెరీర్‌లో 148 వికెట్లు తీశాడు. వన్డే క్రికెట్‌లో ఏడు సార్లు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ టైటిల్స్ గెలిచాడు. ముఖ్యంగా భారత వన్డే ప్రపంచకప్ 2003, 2011 భారత జట్టులో కీలక పాత్ర పోషించారు. 2003లో భారత్ ఫైనల్ చేరుకోవడంలో యువీ కారణమనే చెప్పవచ్చు.
Advertisement
Advertisement
Welcome to the world 𝗢𝗿𝗶𝗼𝗻 𝗞𝗲𝗲𝗰𝗵 𝗦𝗶𝗻𝗴𝗵 ❤️. Mummy and Daddy love their little “puttar”. Your eyes twinkle with every smile just as your name is written amongst the stars ✨ #HappyFathersDay @hazelkeech pic.twitter.com/a3ozeX7gtS
— Yuvraj Singh (@YUVSTRONG12) June 19, 2022
అదేవిధంగా 2011లో కూడా యూవీ అద్భుతంగా ఆడి విజేతగ నిలవడంలో తనవంతు కృషి చేశాడు. ఆ టోర్నీలో 350కి పైగా పరుగులు సాధించి.. 15 వికెట్లు తీయడంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు యువీ అనారోగ్యం దృష్ట్యా అంతర్జాతీయ జట్టులో చోటు కోల్పోయిన యువరాజ్‌సింగ్ ఆ తరువాత జట్టులో స్తానం కోసం రెండేండ్లకు పైగా ఎదురుచూసి రిటైర్‌మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్ 2022 సీజన్‌కు కామెంటెటర్‌గా వ్యవహరించారు యువీ.
Also Read :
స్వచ్ఛ భారత్‌లో చెత్త తీసిన ప్రధాని.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..!
చిరంజీవి రీమేక్ చేయాల్సిన బాషా సినిమాను ఎవరు అడ్డుకున్నారు…? వెనకున్న స్టోరీ ఇదే ..!