Home » చిరంజీవి రీమేక్ చేయాల్సిన బాషా సినిమాను ఎవరు అడ్డుకున్నారు…? వెనకున్న స్టోరీ ఇదే ..!

చిరంజీవి రీమేక్ చేయాల్సిన బాషా సినిమాను ఎవరు అడ్డుకున్నారు…? వెనకున్న స్టోరీ ఇదే ..!

by AJAY
Ad

సూప‌ర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాల‌లో బాష సినిమా కూడా ఒక‌టి. ఈ సినిమా ర‌జినీ కెరీర్ ను మలుపుతిప్పింది. ఈ సినిమాలో రజినీ మ్యానరిజం స్టైల్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆకట్టుకున్నాయి. ఈ సినిమాకు సురేష్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకున్న‌ప్పుడు స‌రేష్ కృష్ణ ర‌జినీకాంత్ రియ‌ల్ లైఫ్ కు ద‌గ్గ‌రగా ఉండాల‌ని కండ‌క్ట‌ర్ గా చూపించాల‌ని అనుకున్నార‌ట‌.

Also Read:  వావ్.. ప్ర‌భాస్‌, మ‌హేష్‌, ఎన్టీఆర్ కాంబినేష‌న్ ఎలా ఉంటుందో ఈ ట్రైల‌ర్‌తోనే తెలిసిపోయింది..!

Advertisement

 

కానీ ర‌జినీ కాంత్ ఆ పాత్ర అంద‌రికీ క‌నెక్ట్ అయ్యేలా ఉండాల‌ని చెప్ప‌డంతో ఆటో డ్రైవ‌ర్ పాత్ర‌ను అనుకుని ఫిక్స్ చేశార‌ట‌. ఇక ఈ సినిమాలో ర‌జినీకాంత్ ను విల‌న్స్ కొట్టే సీన్ సినిమాకు హైలెట్ గా నిలిచింది. ప్రేమికుడు సినిమా చూసి ద‌ర్శ‌కుడు న‌గ్మ‌ను హీరోయిన్ గా ఫిక్స్ చేశాడు. అంతే కాకుండా విల‌న్ గా ర‌ఘువ‌రుణ్ ను ఎంపిక చేశారు. ఇక ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో చిరంజీవి న‌టిస్తున్న బిగ్ బాస్ సినిమా స్టోరీ..బాషా స్టోరీ ఒక‌టే అని ద‌ర్శ‌కుల‌కు తెలిసింది.

Advertisement

దాంతో సురేష్ కృష్ణ చెన్నై కి వెళ్లి బిగ్ బాస్ షూటింగ్ స్పాట్ లో చిరంజీవికి బాషా సినిమా క‌థ‌ను వినిపించారు. ఇక ప‌క్క‌నే అల్లు అర‌వింద్ ఉండ‌టంతో ఆయ‌న కూడా క‌థ విన్నారు. క‌థ న‌చ్చ‌డంతో అల్లు అర‌వింద్ బిగ్ బాస్ సినిమాను ఆపేసి అయినా బాష‌ను తెలుగులో తెర‌కెక్కించాలని అనుకున్నారు. అంతే కాకుండా నిర్మాత‌ల‌న సంప్ర‌దించి 25ల‌క్ష‌లు ఇస్తానని చెప్పారు.

Also read: మేము నీతోనే ఉన్నాం…సాయిప‌ల్ల‌వికి అండ‌గా ప్ర‌కాష్ రాజ్..!

కానీ 40ల‌క్ష‌లు అడ‌గ‌టంతో దానికి కూడా ఒప్పుకున్నారు. ఇక బాష సినిమాను ఏకంగా 9కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కించారు. ఇక గ్రాండ్ గా విడుద‌లైన ఈ సినిమాకు భార అంచనాలు నెల‌కొన్నాయి. అంచ‌నాల‌కు మించి ఈ సినిమా విజ‌యం సాధించింది. ఆ త‌ర‌వాత రీమేక్ రైట్స్ అమ్మాల‌ని నిర్మాత‌లు భావించారు. కానీ అల్లు అర‌వింద్ కు ఈ సినిమా భేరం కుద‌ర‌లేదు. ఆ త‌ర‌వాత డ‌బ్బింగ్ చేయాలని నిర్న‌యించుకున్నారు. ఏకండా డ‌బ్బింగ్ రైట్స్ 80ల‌క్ష‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో 25ల‌క్ష‌లు డ‌బ్బింగ్ రైట్స్ ఉండ‌ట‌మే చాలా ఎక్కువ‌. అలా అల్లు అర‌వింద్ తో భేర కుద‌ర‌క‌పోవ‌డంతో బాషాను రీమేక్ చేయ‌కుండా డ‌బ్ చేసి వ‌దిలారు.

Also Read: హీరో సుమ‌న్ పొలిటిక‌ల్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్నారా..? అందులో నిజం ఎంత‌..!

Visitors Are Also Reading