Home » ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం.. అక్కను కలిసిన చెల్లి..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం.. అక్కను కలిసిన చెల్లి..!

by Anji
Ad

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకీ ఇప్పుడు రసవత్తరంగా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె  షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టినప్పటి నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానంద రెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఇవాళ కడప ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్ లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Advertisement

Advertisement

కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మా ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కుకున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల, సీఎం జగన్ మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగయిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొంత ఊపిరిని పోశారు.

 

ఈనేపథ్యంలోనే ఇవాళ తన సొంత జిల్లా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా పెద్ద షాట్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయి వివేకానంద రెడ్డి కూతురిని కలవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. గెస్ట్ హౌస్ లో తన సోదరి మీదతో షర్మిల భేటీ ఏం మాట్లాడుకున్నారు..? అనేది ఇప్పుడు అంతా చర్చినీయాంశంగా మారింది.

Visitors Are Also Reading