YS Sharmila Assets : తొలిసారి వైయస్ షర్మిల ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఆమె ప్రచారాన్ని కూడా జోరుగా సాగిస్తున్నారు. ఎలక్షన్ల కారణంగా ఇప్పటికే పలువురు నాయకుల ఆస్తులు వివరాలు వెలుగులోకి వచ్చాయి. అలానే షర్మిల ఆస్తుల చిట్టా కూడా వెలుగులోకి వచ్చింది. మాజీ ముఖ్యమంత్రి కూతురు క్రైస్తవ మత ప్రబోధకుడు భార్య షర్మిల ఆస్తులు విలువలు భారీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక వివరాల్లోకి వెళితే కడప ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తున్న షర్మిల సమర్పించిన నామినేషన్ పత్రంలో ఆస్తుల పై కూడా ఆఫిడవిట్ సమర్పించారు.
Advertisement
ఆమె చెప్పిన లెక్కల ప్రకారం షర్మిల ఆస్తులు విలువ ఏకంగా 182.82 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల అధికారికి షర్మిల సమర్పించిన అఫీడవిట్ ప్రకారం ఆమె ఆస్తులు విలువ 182.82 వాటిలో తన సోదరుడు సీఎం జగన్ వద్ద రూ.82,58,15,000 ని షర్మిల అప్పు తీసుకున్నారు. అలానే జగన్ సతీమణి భారతి రెడ్డి దగ్గర కూడా అప్పు చేశారు. ఆమె వద్ద రూ.19,56,682 అప్పు షర్మిల చేయడం జరిగింది. షర్మిల సంపాదన ఏడాదికి రూ.97,14,213. ఆమె భర్త సంపాదన వచ్చేసి రూ.3,00,261 మాత్రమే.
Advertisement
Also read:
Also read:
ఆమె స్థిరాస్తుల చూస్తే.. షర్మిలకు రూ.9,29,58,180, ఆమె భర్త కి రూ.4,05,92,365 విలువైన స్థిరాస్తులు వున్నాయి. అనిల్ కుమార్ అప్పులు రూ.35,81,19,299 గా ఉన్నాయి. షర్మిల కు రూ.3,69,36,000 విలువైన బంగారం, రూ.4,61,90,688 విలువైన వజ్రాభరణాలు ఉన్నట్టు తెలుస్తోంది. అనిల్ కుమార్ దగ్గరైతే రూ.81 లక్షల విలువైన బంగారం, రూ.42 లక్షల విలువైన వజ్రాభరణాలు ఉన్నాయి. షర్మిలపై 8 కేసులు నమోదు అయ్యాయి. తెలంగాణ రాజకీయాల్లో సొంత పార్టీ పెట్టి ఉద్యమాలు చేసే టైం లో ఇవి నమోదు అయ్యినట్టు తెలుస్తోంది.
తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి..!