Home » Vijay Devarakonda: అందుకే విజయ్ దేవరకొండ కి స్టార్ డైరెక్టర్లు హ్యాండ్ ఇస్తున్నారా..?

Vijay Devarakonda: అందుకే విజయ్ దేవరకొండ కి స్టార్ డైరెక్టర్లు హ్యాండ్ ఇస్తున్నారా..?

by Sravya
Ad

Vijay Devarakonda : విజయ్ దేవరకొండ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ లోకి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి వంటి సినిమాలతో వచ్చి బ్లాక్ బస్టర్స్ తో ఓవర్ నైట్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత వచ్చిన గీత గోవిందం సినిమాతో 100 కోట క్లబ్లో చేరిపోయారు విజయ్. కానీ ఈ మధ్య వరుస ప్లాప్ లను అందుకుంటున్నారు. అయితే ఇందులో భాగంగా ఈయన తో సినిమాలు చేయాలనుకుంటున్నా స్టార్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు విజయ్ దేవరకొండ ని పట్టించుకోవట్లేదు. దర్శకుడు సుకుమార్ విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేశారు.

Advertisement

కానీ సినిమా క్యాన్సిల్ అయిపోయింది. ఆ స్టోరీ తోనే రామ్ చరణ్ హీరోగా పెట్టి సుకుమార్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తోంది. వంశీ పైడిపల్లి కూడా విజయ్ దేవరకొండ తో ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. కానీ కొన్ని కారణాల వలన ఆ సినిమా కూడా లేనట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్లాపులని చూసి దర్శకులు భయపడుతున్నారు. సినిమాలు చేయడానికి ముందుగా రావట్లేదు. ముందు సినిమా అనుకున్న వాళ్లు కూడా పట్టించుకోవట్లేదు. మీడియం రేంజ్ డైరెక్టర్లతో సినిమాలు చేయలేక మధ్యలో ఇబ్బంది పడుతున్నారు విజయ్.

Advertisement

Also read:

family-star-movie

Also read:

ఇప్పుడు హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరు అని ప్రశ్నలు వస్తున్నాయి. గౌతమ్ తిన్ననూరు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు విజయ్. పరుశురాం డైరెక్షన్లో చేసిన ఫ్యామిలీ స్టార్ సినిమా అనుకున్న విజయాన్ని అందుకోలేదు. కనుక ఇకమీదట విజయ్ దేవరకొండ చేసే సినిమాలు పై జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని భావిస్తున్నారు. లేదంటే మాత్రం కెరియర్ లో ఇబ్బందులు వస్తాయి ఫ్యామిలీ స్టార్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇంకో సినిమా అయితే కమిట్ అవలేదు. ఈ క్రమంలోనే ఆయన ఎలాంటి కథల్ని ఎంచుకొని ముందుకు సాగుతారు అనేది చూడాల్సి ఉంది. రాబోయే రోజుల్లోనైనా విజయ్ దేవరకొండ మంచి హిట్ అందుకుని మళ్లీ కెరీర్ ని ఓ లైన్లో పెట్టుకుంటే బాగుండని ఫాన్స్ అభిప్రాయపడుతున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading