Home » Anushka : డైరెక్టర్స్ కి అనుష్క కండిషన్.. అందుకు ఓకే చెప్తేనే మూవీ..!

Anushka : డైరెక్టర్స్ కి అనుష్క కండిషన్.. అందుకు ఓకే చెప్తేనే మూవీ..!

by Sravya
Ad

Anushka  : అనుష్క లేడీ ఓరియంటెడ్ సినిమాలతో అందరినీ బాగా ఆకట్టుకుంది. మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. చాలామంది టాప్ హీరోలు పక్కన నటించింది అనుష్క. లేడీ ఓరియంటెడ్ సినిమా కాకపోయినా కథ మొత్తం ఆమె క్యారెక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఆమెకి చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర ఇస్తేనే ఓకే చెప్తారు. కనుక అనుష్కతో మూవీ చేయాలంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుతో వెళ్లాలని మూవీ మేకర్స్ భావిస్తారు. స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి కొన్నాళ్లుగా సెలెక్టివ్ గా మూవీస్ చేస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత ఆమె క్రేజ్ బాగా పెరిగింది.

Advertisement

ఆ జోష్లో ఆమె వరుస సినిమాలు చేస్తారని అనుకుంటే చాలా గ్యాప్ తీసుకున్నారు రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయడానికి అస్సలు ఇష్టపడట్లేదు. విభిన్నమైన కథలని ఎంచుకుంటున్నారు. బాహుబలి 2 తర్వాత అనుష్క లేడీ ఓరియంటెడ్ మూవీ భాగమతి సినిమా చేసింది. అది హిట్ అయింది కూడా. సైలెంట్ గానే ఉండిపోయింది. తర్వాత సైరా నరసింహారెడ్డి సినిమాలో చిన్న రోల్ చేసింది. 2020లో నిశ్శబ్దం సినిమా చేసింది. కొంచెం గ్యాప్ తీసుకుని గత ఏడాది సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసి మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టితో ప్రేక్షకులు ముందుకి వచ్చింది.

Also read:

Advertisement

Also read:

ఈ సినిమాకి కూడా రెస్పాన్స్ బానే వచ్చింది. తన వద్దకు వచ్చిన క్యారెక్టర్స్ కి ఒక కండిషన్ పెడుతుందట దానికి ఒప్పుకుంటేనే సినిమాలు చేస్తుందట అనుష్క. రొటీన్ సినిమాలు చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ చూపించరు. తాను సినిమా చేయాలంటే కచ్చితంగా అది లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టు అవ్వాలి. ఈ కండిషన్ ని అనుష్క పెడుతుందట. ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఘాటి సినిమాలో నటిస్తోంది. లేడీ ఓరియంటెడ్ సినిమా కాగా ఈ సినిమాలో అనుష్క వేశ్య పాత్రలో నటించబోతోంది. మలయాళం లో ఒక సినిమా కూడా చేస్తోంది. ఆమెకి చాలా ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడంతో వెంటనే ఓకే చెప్పేశారు అనుష్కతో మూవీ చేయాలంటే లేడీ ఓరియంటెడ్ సబ్జెక్టుతో వెళ్లాలని మూవీ మేకర్స్ అందరూ కూడా భావిస్తున్నారు.

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

 

Visitors Are Also Reading