Home » గంగ‌వ్వ ఒక్క రోజుకే అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందా..? నెల‌కు ఎంత సంపాదిస్తుందంటే..?

గంగ‌వ్వ ఒక్క రోజుకే అంత రెమ్యున‌రేష‌న్ తీసుకుంటుందా..? నెల‌కు ఎంత సంపాదిస్తుందంటే..?

by AJAY
Ad

ఒక‌ప్పుడు ఎంతో టాలెంట్ ఉన్నా కూడా తెర‌పై మ‌రవాలంటే ముందు ఆడిషన్స్ ఇవ్వాలి. ఆ త‌ర‌వాత న‌చ్చితే సినిమాలు సీరియ‌ల్స్ లో అవ‌కాశాలు వ‌చ్చేవి. కానీ ఇప్పుడు అలా కాదు సోష‌ల్ మీడియా ప్ర‌భావం పెర‌గ‌టంతో యూట్యూబ్, టిక్ టాక్ లో టాలెంట్ నిరూపించుకుని కూడా సినిమా అవ‌కాశాల‌ను అందుకుంటున్నారు. ఇక తెలుగులో ఎక్కువ పాపుల‌ర్ అయిన యూట్యూబ్ ఛానల్స్ లో మై విలేజ్ షో కూడా ఒక‌టి. ఈ యూట్యూబ్ ఛాన‌ల్ ద్వారా చాలా మంది న‌టీన‌టులు ప‌రిచ‌యం అయ్యారు.

Advertisement

ఈ యూట్యూబ్ ఛాన‌ల్ లో ఓ ప‌ల్లెటూరు నేటివిటిని చూపించే విధంగా మాడ్ర‌న్ క‌ల్చ‌ర్ ను విలేజ క‌ల్చర్ తో పోలుస్తూ వీడియాలు ఉంటాయి. ఆ వీడియోలు ఎంతో వినోదాత్మ‌కంగా ఉండ‌టంతో చాలా మంది అభిమానులు అయ్యారు. ఇక ఈ ఛాన‌ల్ లో న‌టించేవారిలో గంగ‌వ్వ అనే మ‌హిళ ఎక్కువ మంది అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

Advertisement

gangavva

gangavva

ప‌ల్లెటూరు యాస‌లో గంగ‌వ్వ చెప్పే డైలాగులు ప్రేక్ష‌కుల కు తెగ‌న‌చ్చాయి. దాంతో గంగ‌వ్వ సినిమా ఆఫ‌ర్ ల‌ను అందుకున్నారు. అంతే కాకుండా ఈ యూట్యాబ్ ఛాన‌ల్ ద్వారా టాలీవుడ్ టాప్ హీరోల‌ను హీరోయిన్ లను గంగవ్వ ఇంట‌ర్వ్యూలు చేశారు. అంతే కాకుండా నాగార్జున హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న బిగ్ బాస్ టీవీ షోలో గంగ‌వ్వ కంటెస్టెంట్ గా వ‌చ్చారు. గంగ‌వ్వ త‌న కామెడీతో మంచిత‌నంతో అభిమానుల‌ను సంపాదించుకున్నారు.

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం గంగ‌వ్వ మైవీలేజ్ షోలో న‌టిస్తూనే సినిమాల్లోనూ ఫుల్ బిజీగా మారిపోయారు. కాగా గంగ‌వ్వ ఒక్కరోజు కాల్ షీట్ కోసం 10వేల రూపాయ‌ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటార‌ని తెలుస్తోంది. అంతే కాకుండా త‌మ యూట్యూబ్ ఛానల్ ద్వారా నెల‌కు ల‌క్ష రూపాయ‌లు తీసుకుంటుంద‌ని స‌మాచారం. టాలెంట్ ఉంటే ఏ వ‌య‌సులో అయినా ఎక్కడ ఉన్నా అవ‌కాశాల‌ను అందుకోవ‌చ్చ‌ని గంగ‌వ్వ నిరూపించుకుని ఎంతో మందికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

Visitors Are Also Reading