సాధారణంగా ఏదైనా వీడియో చూడాలంటే తప్పకుండా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటాం. ఇక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చూడకుండా అసలు ఉండలేరు. ఎంతో మంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి, టైమ్ పాస్ చేసేందుకు యూట్యూబ్ ని విపరీతంగా వాడుతుంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా యూట్యూబ్‌లో పలు గేమ్స్, కథలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు. యూగ్యూమ్క కొన్ని బిలియన్ల వీడియోలు ఉంటాయి.గూగుల్ తరువాత అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ యూట అందుకే ఏది సెర్చ్ చేసినా వీడియోల రూపంలో అందిస్తుంది. రోజుకు కొన్ని లక్షల వీడియోలు అప్లోడ్ చేస్తుంటారు. ఓ వీడియో చూడగానే దానికి రిలేటివ్ వీడియోస్ అన్ని చక్కర్లు కొడుతుంటాయి.
షార్ట్ ఫిలింమ్స్ కి మంచి వేదిక యూట్యూబ్. అంతేకాదు నచ్చిన సినిమాలు, నచ్చిన వీడియోలు ఇష్టమైన షోస్, సాంగ్స్, కామెడీ, జంతువులు, పక్షుల వీడియోలు వైరల్ వీడియోలు ఇలా ఎన్నో దర్శనమిస్తుంటాయి. యూట్యూబ్ వ్యూవర్స్ కోసం ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అప్‌డేట్ చేస్తుంటారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా పలు మార్పులు చేపడుతుంటారు. ఇప్పటికే ఎన్నో ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన యూట్యూబ్ మరో ఫీచర్ తో మరింత సులభం చేయనున్నది.
Advertisement
Advertisement
ఇక యూట్యూబ్‌లో ఎక్కువ డ్యూరేషన్ ఉన్న వీడియోలు చూడాలంటే.. టైం వేస్ట్ అవుతుంటుంది. నచ్చిన సీన్ చూడాలంటే వీడియో మొత్తం చూడాలి. దీంతో చాలా సమయం వృథా అవుతుంటుంది. అందుకే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు యూట్యూబ్ నూతన ఫీచర్ తీసుకొచ్చింది. వీడియోలో ఇంట్రెస్టింగ్ సీన్ నచ్చిన సీన్ ఎక్కడుందో గుర్తించే విధంగా చేస్తోంది. ముఖ్యంగా ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండగా.. అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మనం చూసే వీడియోలో ఎక్కువగా ప్లే చేసిన పార్ట్‌ను స్పెషల్‌గా చూపించనున్నది. ఇది గుర్తించడానికి యూట్యూబ్ ప్లేయర్ లో ఓ గ్రాఫ్ పాపులర్ పార్ట్ వద్ద హైగా ఉంటుంది. వెంటనే ఆ పార్ట్‌కు వెళ్లి చూడవచ్చు. అదేవిధంగా ఓ వీడియోను ఎక్కువసార్లు చూడాలనుకునే వారి కోసం సింగిల్ లూప్ వీడియో ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది.
Also Read :
ఎన్ని సంబంధాలు వచ్చినా మీకు పెళ్లి కావడం లేదా..? ఈ వాస్తు దోషాలు ఉంటే సరిచేసుకోండి..!
వాణిశ్రీ సినిమాలు మానేయడానికి కారణం ఆరోజు జరిగిన సంఘటనేనా..!!