Telugu News » ఎన్ని సంబంధాలు వ‌చ్చినా మీకు పెళ్లి కావ‌డం లేదా..? ఈ వాస్తు దోషాలు ఉంటే స‌రిచేసుకోండి..!

ఎన్ని సంబంధాలు వ‌చ్చినా మీకు పెళ్లి కావ‌డం లేదా..? ఈ వాస్తు దోషాలు ఉంటే స‌రిచేసుకోండి..!

by Anji

భార‌త‌దేశ ప్రాచీన గ్రంథాలు పెళ్లి అనేది ప‌విత్ర‌మైన సంబంధం అని నిర్వ‌చిస్తున్నాయి. ముఖ్యంగా భాగ‌స్వాములిద్ద‌రికీ వేరువేరు విధుల‌ను కేటాయించాయి. వాస్తు ప‌ద్ద‌తిలో పెళ్లికి సంబంధించిన కొన్ని తెలుసుకోవాల్సిన నియ‌మాల గురించి మాట్లాడుకుందాం. ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి కాకుండా ఇబ్బంది ప‌డే వారు ఎంతో మంది ఉన్నారు. వారు ప్ర‌ధానంగా ఈ వాస్తు నియ‌మాల‌ను త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి.

Ads

భ‌గ‌వంతుడు స్త్రీ, పురుషులిద్ద‌రూ ఒక‌రొకొక‌రు ప్రేమించుకోవ‌డానికి ఆనందంతో కూడిన ప్ర‌శాంత‌మైన జీవితాన్ని గ‌డ‌ప‌డానికి సృష్టించాడు. ఇక కుటుంబ స‌భ్యులంద‌రి మ‌ధ్య ప్రేమ‌, ఆప్యాయ‌త కోసం వాస్తు సూత్రాలు అద్భుతాలు సృష్టిస్తాయి. కొన్ని నియ‌మ‌, నిబంధ‌న‌ల‌ను పాటించ‌డం ద్వారా వాస్తు శాస్త్రం ప్రేమ, లోతైన భావాల‌ను ప్రేరేపిస్తుంది. ఈ సంబంధాన్ని ఆనంద‌దాయ‌కంగా ఫ‌ల‌వంతంగా మార్చ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. వాస్తు అనేది ఓ అయ‌స్కాంత విధ‌మైన శ‌క్తి. ఈ శ‌క్తి జీవ‌న ప్రదేశంలో ఆరోగ్య‌వంత‌మైన బంధాన్ని కొన‌సాగించ‌డానికి కీల‌కం. ఇక వివాహ విష‌యంలో ఈ వాస్తు శాస్త్ర నియ‌మాలు ఎంత‌గానో ప‌ని చేస్తాయ‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇక పెళ్లి కానీ అమ్మాయిల‌కు పెళ్లిలో జాప్యం, స‌మ‌స్య‌లు త‌ల్లిదండ్రుల‌కు పెద్ద టెన్ష‌న్‌. అమ్మాయి కోసం కేటాయించిన గ‌ది ఇంటి నైరుతి దిశ‌లో ఉండ‌కూడ‌దు. నైరుతి ప్రాంతాలు ఇంట్లో స్థిర‌త్వాన్ని ఇస్తాయి. అమ్మాయిని పెళ్లికి సుల‌భంగా వెళ్ల‌నివ్వ‌వు. పెళ్లి కానీ అమ్మాయిల‌కు ఇంటి వాయువ్య భాగంలోని గ‌ది ఉత్త‌మం. ఈ స్థ‌లం వారికి అందుబాటులో లేకుంటే ప‌డ‌మ‌ర దిశ ఎంపిక చేసుకోవ‌చ్చు. ఇక అబ్బాయి ఇంటికి పెద్ద‌వాడు, కుటుంబ పెద్ద అయితే నైరుతి దిక్కులు బాగా స‌రిపోతాయి.


ముఖ్యంగా అండ‌ర్ గ్రౌండ్ వాట‌ర్ ట్యాంకుల నిర్మాణాలు నైరుతి వైపు ఏర్పాటు చేయ‌డం ద్వారా పెళ్లి ఆల‌స్యానికి ప్రధాన కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు. నైరుతికి దిగువ‌న తేలిక‌గా ఉండే ఎత్తులు వివాహానికి సంబంధించిన ఆల‌స్యం అడ్డంకికి మ‌రో కార‌ణం. పెళ్లి చేసుకోని అమ్మాయిలు ఇంట్లో ఉన్న‌టువంటి నైరుతి మూల‌ను ప‌డ‌క‌గ‌దిగా ఉప‌యోగించ‌కుండా జాగ్ర‌త్త తీసుకోవాలి. అమ్మాయిల‌కు కానీ అబ్బాయిల‌కు కానీ కుజ‌దోషం ఉంటే పెళ్లిలో జాప్యం జ‌రుగుతుంద‌ని చెబుతారు. పెళ్లి కావాల్సిన స్త్రీ, పురుషుల గ‌దుల్లో వస్తువుల అమెరికా వివాహంపై ప్ర‌భావం చూపిస్తుంది. పెళ్లికి కావాల్సిన వారి గ‌దుల్లో న‌లుపు రంగు లేదా గోధుమ రంగులో రంగులు ఉంటే ఆ పెళ్లి ప్ర‌తిబంధ‌కంగా ప‌ని చేస్తాయి.


ఎప్పుడూ పెళ్లి కావాల్సిన స్త్రీ, పురుషుల మంచం కింద ప్ర‌దేశం కాబ‌ట్టి ఎల్ల‌ప్పుడూ ఖాళీగా ఉండాలి. మంచం కింద ప్ర‌దేశంలో సామ‌న్లు, చెత్త చెదారం ఎక్కువ‌గా ఉంటే వివాహానికి ఆటంకాలు క‌లుగుతాయ‌ని అవి దుర‌దృష్టాన్ని తీసుకొస్తాయ‌ని చెబుతారు. మంచానికే ఎదురుగా అద్దాలు నా దుర‌దృష్టం వెంటాడుతుంద‌ని అమ్మాయి ప‌డుకునే గ‌దిలో మంచం పై భీమ్ ఉండ‌కూడ‌దు అని చెబుతున్నారు. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచ‌న‌ల‌తో ఉండ‌డం చాలా అవ‌స‌రం. త‌న‌కు పెళ్లి కావ‌డం లేద‌ని ఎప్పుడూ నెగిటివ్ ఆలోచ‌న‌ల‌తో ఉండే అమ్మాయిల‌కు పెళ్లి మ‌రింత ఆల‌స్యం అవుతుంద‌ని పెద్ద‌లు చెబుతుంటారు. పెళ్లి విష‌యంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఎప్పుడూ పాజిటివ్ దృక్ప‌థంతో ఉండాలి. వాస్తు నియ‌మాల‌ను పాటించ‌డంతో పాటు పాజిటివ్ దృక్ప‌థంతో ఉన్న‌ప్పుడు పెళ్లి త్వ‌ర‌గా జ‌రుగుతుంది.

Also Read : 

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారికి సమాజంలో గుర్తింపు లభిస్తుంది

బిగ్‌బాస్ విజేత బింధుమాద‌వి.. తొలిసారి మ‌హిళ రికార్డు..!

 


You may also like