ప్రస్తుతం తెల్లజుట్టు సమస్యతో అన్ని వయస్సుల వారు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమస్యలు రావడానికి చాలా కారణాలున్నప్పటికీ ప్రతిరోజూ చేసే పలు తప్పుడు పనుల కారణంగా.. జన్యుపరమైన కారణంగా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి సులభంగా ఉపశమనం పొందేందుకు పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read : అందంగా కనిపించేందుకు ముక్కుకు సర్జరీ చేయించుకున్న స్టార్ హీరోయిన్.. చివరికీ ఏమైందంటే..?
Advertisement
జుట్టు తెల్లగా మారడానికి ప్రధాన కారణాలు :
- అనారోగ్యకరమైన ఆహారం ప్రతి రోజూ తినడం.
- అనవసరమైన టెన్షన్ పడటం.
- విటమిన్, ఖనిజ లోపం వల్ల తెల్ల జుట్టు సమస్యలు వస్తాయి.
- రసాయనాలు అధికంగా ఉండే షాంపులు వాడడం వల్ల.
- జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవించవచ్చు.
షాంపులు తగ్గించాలి :
Advertisement
చాలా మంది ప్రస్తుతం వెంట్రుకలు అందంగా కనిపించేందుకు పలు రకాల రసాయనాలతో కూడినటువంటి షాంపూలను వినియోగిస్తున్నారు. వీటికి బదులు ఆర్గానిక్ షాంపులను వినియోగించడం చాలా మంచిది అని నిపుణులు పేర్కొంటున్నారు. షాంపులను అతిగా వినియోగించకుండా మానుకోవడం చాలా బెటర్.
Also Read : ఈ 3 వ్యాధులు ఉన్న వారు వేరు శనగ తింటే ప్రమాదంలో పడ్డట్టే..?
హెల్తీ ఫుడ్స్ :
ఫాస్ట్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా జుట్టు త్వరగా నెరసిపోతుందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా ప్రతి రోజు హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా ఉత్తమం.
Also Read : వేసవిలో మీ చర్మం ఆరోగ్యం కోసం ఇవి తీసుకుంటే ఫలితం పక్కా..!
కొబ్బరి నూనె :
ప్రస్తుతం చాలా మంది జుట్టుకు రసాయనాలతో కూడిన నూనెలు అతిగా వినియోగిస్తున్నారు. వాటికి బదులుగా కొబ్బరి నూనె ప్రతి రోజూ వినియోగించడం చాలా మంచిదని నిపుణులు పేర్కొంటున్నారు. మార్కెట్ లో లభించే కెమికల్స్ తో కూడిన హెయిర్ ఆయిల్స్ ని వినియోగించకపోవడం చాలా మంచిది అని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
Also Read : కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలంటే ఈ 5 అలవాట్లను తప్పక పాటించండి..!