Home » 10th After Career Course:10th తర్వాత మీ దారేటు.. ఈ కోర్సులు చేస్తే ఉద్యోగం పక్కా..!!

10th After Career Course:10th తర్వాత మీ దారేటు.. ఈ కోర్సులు చేస్తే ఉద్యోగం పక్కా..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

కోటి చదువులు కూటి కోసమే అన్నారు పెద్దలు. మనం బడిలో అడుగు పెట్టినప్పటి నుంచి పదో తరగతి వచ్చేవరకు ఒక విధమైనటువంటి వాతావరణంలో చదువు ఉంటుంది. ఆ తర్వాత టెన్త్ క్లాస్ మంచి ఉత్తీర్ణతతో పాస్ అయితే తర్వాత చదువులో ముందుకెళ్లవచ్చు. ఏది చేయాలన్న టెన్త్ క్లాస్ అనేది పూర్తి చేయాలి. కానీ టెన్త్ తర్వాత విద్యార్థి దశ కాస్త మారిపోతుంది. టెన్త్ వరకు భయంతో చదువుతారు. టెన్త్ అయిపోగానే కాస్త ఫ్రీడం ఉంటుంది. ఏది ఏమైనా చాలామంది టెన్త్ పాసైన తర్వాత ఏ వైపు వెళ్లాలని సతమతమవుతూ ఉంటారు..

Advertisement

Also Read:ఏపీ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త….త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్

అలాంటి వారికి ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాం.. చూసేద్దామా మరి.. సాధారణంగా ఇంజనీరింగ్ వైపు వెళ్లాలి అంటే ఎంపీసీ , ఎంఈసి వంటి కోర్సులు ఉంటాయి. అలాగే చార్టెడ్ అకౌంట్ వైపు వెళ్ళాలి అంటే సిఈసి, ఎంఈసి వంటి ప్రత్యేకమైన కోర్సులు ఉంటాయి. అలాగే మెడికల్ వైపు వెళ్లాలి అంటే బైపిసి వంటి కోర్సులు ఉంటాయి. ఇది పూర్తి చేసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఉండేది ఎంసెట్, జేఈఈ,నీట్, బిట్ షాట్ వంటి పరీక్షల ద్వారా ఇంజనీరింగ్ మెడికల్ కాలేజీల్లో సీట్లు పొందవచ్చు.

Advertisement

ఈ కోర్సులు ఉంటాయి:
CEC- సివిక్స్= ఎకనామిక్స్= కామర్స్
MEC- మ్యాథ్స్ = ఎకనామిక్స్= కామర్స్..
BIPC- బయాలజీ ( బోటనీ జువాలజీ ) ఫిజిక్స్ = కెమిస్ట్రీ.
HEC- హిస్టరీ= ఎకనామిక్స్= సివిక్స్ లేదంటే కామర్సు.
MPC- మ్యాథ్స్ = ఫిజిక్స్ = కెమిస్ట్రీ
MBPC- మ్యాథ్స్ = బయాలజీ= ఫిజిక్స్ =కెమిస్ట్రీ.
ఇంకొంతమంది విద్యార్థులు సైన్స్ గ్రూప్స్ అన్న మ్యాథ్స్ కోర్సులు చేయాలంటే భయపడిపోతుంటారు. అలాంటి వారి కోసం హిస్టరీ, ఫిలాసఫీ, సోషియాలజీ, లిటరేచర్, వంటి సబ్జెక్టులు ఇష్టమైతే జర్నలిజం, సోషల్ వర్క్, టీచింగ్ ఫీల్డ్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

Also Read:సింగర్ సునీత కూతురు ముందు స్టార్ హీరోయిన్ కూడా తేలిపోద్ది.. ఎంత అందమంటే..!!

ఇక టెక్నికల్ కోర్సులు:
డిప్లమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్
డిప్లమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్
డిప్లమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్
డిప్లమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్.
డిప్లమా ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్.
డిప్లమా ఇన్ అగ్రికల్చర్
డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్
డిప్లమా ఇన్ హోమ్ సైన్స్
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ సర్వీస్ కోర్స్
డిప్లమా ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ వంటి టెక్నికల్ కోర్సులు అందుబాటులో ఉంటాయి.

Also Read:Nayanatara : ఆ రాజకీయ నాయకుడితో నయనతార రిలేషన్ షిప్ !

Visitors Are Also Reading