పెళ్లంటే ఒకప్పుడు కొద్ది రోజుల నుంచి పండుగ వాతావరణంలో జరిగేది. కాని ప్రస్తుత కాలంలో పెళ్లిళ్లు ఆన్ లైన్ లో జరిగే వరకు వచ్చాయి. ఇంత బిజీ లైఫ్ లో పెళ్లి గురించి ప్రస్తావించే వారు చాలా తక్కువ. ఇక అప్పట్లో పెద్దలు వెళ్లి ముందు అమ్మాయిని లేదా అబ్బాయిని చూసి వచ్చేవారు. ఆ తర్వాత కొంతమంది పెద్దలు పెళ్లి కొడుకు తో అమ్మాయి ఇంటికి వెళ్లి అమ్మాయిని చూసేవారు. ఈ సమయంలో అమ్మాయి చక్కగా రెడీ అయి, సిగ్గుపడుతూ వచ్చి అబ్బాయి అమ్మాయి చూసుకునేవారు. అమ్మాయిలకు అంత స్వతంత్రత ఉండేది కాదు. కానీ ప్రస్తుత కాలంలో అబ్బాయిలనే అమ్మాయిలు సెలెక్ట్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఇది ఒకింత మంచి విషయమే కావచ్చు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ విషయాలు మనకు నవ్వు తెప్పిస్తున్నాయి. అలాగే ఒక అమ్మాయి చేసిన పనికి సోషల్ మీడియా అంతా నవ్వుకుంటుంది అది ఏంటో చూద్దాం. బెంగళూరుకి చెందినటువంటి ఒక వ్యాపారస్తురాలు ఉదిత పాల్ అనే యువతికి ఇంకా వివాహం కాలేదు.
Advertisement
ఆమెకు మ్యాట్రిమోనియల్ లో పెళ్లి కొడుకు డీటెయిల్స్ పంపిన తండ్రి ఆయనతో మాట్లాడమని చెప్పారు. సరేనని అమ్మాయి అబ్బాయి ని కాంటాక్ట్ చేసింది. అతని చదువు మరియు ఉద్యోగ అనుభవాలను తెలుసుకున్నది. వెంటనే వారి కంపెనీలో ఖాళీలు ఉన్నాయని చెప్పి అతని రెజ్యూమ్ పంపాలని కోరింది. అబ్బాయి రెజ్యూమ్ పంపిన తర్వాత అతనికి ఇంటర్వ్యూ లింకులు కూడా పంపింది. దీంతో వారి సంభాషణ ఉద్యోగం గురించి వెళ్లి ఆ తర్వాత ముగిసినది..
Advertisement
https://www.ntnews.com/trending/father-reaction-to-girl-hiring-probable-groom-on-matrimonial-site-goes-viral-566419
ALSO READ :
టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తున్న ఈ కోటీశ్వరుడిని మీరు గుర్తు పట్టారా..?
ఎన్టీఆర్ పై ఆ హీరోయిన్ కాలు వేస్తానంటే ఆ నిర్మాత అలా అన్నారా..?