Home » మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

మ్యాచ్ జరుగుతున్న సమయంలో అంపైర్ ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ad

క్రికెట్ లో ఒక్కొక్కసారి కొన్ని విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. క్రీడాకారులు, ప్రేక్షకులు, అంఫైర్స్ విచిత్ర చేష్టలతో వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ అంఫైర్ మ్యాచ్ మధ్యలో చేసిన పని ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దక్షిణాఫ్రికా ఇంగ్లండ్ మూడు వన్డేల సిరీస్ లో భాగంగా తొలివన్డేలో సీనియర్ అంఫైర్ మరాయిస్ ఎరాస్మస్ మైదానంలో ప్రవర్తించిన తీరుపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఆటను పట్టించుకోకుండా ఎరాస్మస్ తన పనిని తాను చేసుకోవడం..టీవీ కెమెరాలలో కనిపించడంతో దీనిపై నెటిజన్లు ఎరాస్మస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. మ్యాచ్ జరుగుతుందనే విషయాన్ని ఎరాస్మస్ మరిచిపోయినట్టు ఉన్నాడని కొందరూ కామెంట్స్ చేస్తున్నారు. 

Advertisement

ఈ సంఘటన ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సందర్భంగా 24వ ఓవర్ లో చోటు చేసుకుంది. క్రీజులో జేసన్ రాయ్ బ్యాటింగ్ చేస్తుండగా ఎరాస్మస్ లెగ్ అంఫైర్ గా ఉన్నాడు. ఆటను గమనించకుండా పక్కకి జరిగి తన పని తాను చేసుకున్నాడు. ఆటతో తనకు సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ విషయంపై నెటిజన్లు కొందరూ తమ కామెంట్స్ లో వన్డేలను ఎవడు చూస్తాడని ఎరాస్మస్ ఫీలింగ్ అని ఒకరు పేర్కొనగా.. థర్డ్ అంపైర్ చూసుకుంటాడు లే అనే భరోసా ఎరాస్మస్ కి ఉన్నదని అనుకుంటాను అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్ పై దక్షిణాప్రికా 27 పరుగుల తేడాతో గెలుపొందింది.  

Advertisement

Also Read :  సలార్ సినిమా నుండి పవర్ ఫుల్ డైలాగ్ లీక్… నెట్టింట వైరల్…!

ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆప్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 298 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్ లల వాండర్ డుసెన్ (111 పరుగులు, 117 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్ తో) సెంచరీ చేయగా.. డేవిడ్ మిల్లర్ (53) హాఫ్ సెంచరీతో మంచి ఆటతీరు కనబరిచాడు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. జోప్రా ఆర్చర్, మెయిన్ అలీ, ఆదిల్ రషీద్, ఒల్లీ స్టోన్ తలో వికెట్ దక్కించుకున్నారు. ఇక ఇంగ్లండ్ 44.2 ఓవర్లలో 271 పరుగులకు కుప్పకూలింది. జాసన్ రాయ్ (91 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్ లతో 113) సెంచరీ, డేవిడ్ మలాన్ (59) హాఫ్ సెంచరీ తప్ప మిగతా బ్యాట్స్ మెన్ రాణించలేకపోయారు. 

Also Read :  తారక రత్నకు మెలేనా..ఈ వ్యాధి కారణాలు, లక్షణాలు ఇవే

Visitors Are Also Reading