Home » బ్రో మూవీ కలెక్షన్ల గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

బ్రో మూవీ కలెక్షన్ల గురించి వింటే ఆశ్చర్యపోవడం పక్కా..!

by Anji
Ad

సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు మొదటివారం కలెక్షన్లు చాలా కీలకం అనే విషయం దాదాపు అందరికీ తెలిసిన విషయమే. అగ్ర నిర్మాతలు స్టార్ హీరోలు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి.. ఎంత కష్టం అయినా వాళ్లతోనే సినిమా చేసేందుకు సిద్ధమవుతారు. ఫస్ట్ వీక్ వాళ్లు పెట్టిన మొత్తం బడ్జెట్ రీకవరీ చేసి ఆ తరువాత లాభాలు గడించవచ్చని భావిస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో రివర్స్ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా తీవ్రంగా నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. ప్రస్తుతం బ్రో మూవీ పరిస్థితి కూడా అలాగే ఉంది. 

bro-review

Advertisement

 

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటించిన ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పవర్ స్టార్ మేనియాతో తొలి మూడు రోజులు ఒక మాదిరిగానే కలెక్షన్లు వసూలు చేసింది బ్రో మూవీ.కానీ సోమవారం నుంచి కలెక్షన్లు కంప్లీట్ గా పడిపోయాయి.  ఎంతగా పడిపోయాయంటే.. ఇటీవలే చిన్న సినిమాగా విడుదలైన సంచలన విజయం సాధిస్తున్న బేబి మూవీ కంటే కూడా పవన్ కళ్యాణ్ బ్రో మూవీ అతితక్కువ కలెక్షన్లు వూలు చేసేంతలా పడిపోయింది. తమిళంలో సూపర్ హిట్ సాధించిన వినోదయ సీతమ్ రీమేక్ గా తెరకెక్కిన బ్రో మూవీ ముందు నుంచే చాలా నెగిటివ్ టాక్ దక్కించుకుంది. ఇందుకు ప్రధాన కారణం ముందు నుంచి పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమాలు చేయడమే.

Advertisement

సముద్ర ఖని దర్శకత్వంలో తెరకెక్కిన బ్రో సినిమాకి పవన్ కళ్యాణ్ రూ.40కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ కనిపిస్తే చాలు కలెక్షన్లు వస్తాయి. ఆయన పేరు వినిపిస్తే చాలా డబ్బులు కుప్పలా కింద వచ్చి పడతాయని చెప్పే మాటలు కేవలం గాలి మాటలు అని మరొక సారి రుజువు అయింది. ఇటీవలే విడుదలైన బేబి మూవీ నాలుగో రోజు 3.2 కోట్లు వసూలు చేయగా.. బ్రో మూవీ కేవలం 2.5 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం. దీంతో సోషల్ మీడియాలో బ్రో మూవీ కలెక్షన్ల గురించి కొంత మంది రీల్స్ చేసి వైరల్ చేస్తున్నారు. స్టార్స్ ని నమ్ముకొని సినిమాలు తీసే కంటే కంటెంట్ నమ్ముకొని మూవీస్ చేయడం ఉత్తమం. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ముందు నుంచి బ్రో మూవీ కంటే OG మూవీపైనే ఎక్కువగా నమ్మకంగా ఉన్నారు. OG మూవీపైనే ఎక్కువగా నమ్మకంగా ఉన్నారు. OG సినిమా ద్వారానే పవన్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడో లేదో వేచి చూడాలి మరీ. 

మరికొన్ని ముఖ్యమైన వార్తలు : 

పుష్ప 2 మూవీలో తమిళ స్టార్ హీరో నటించనున్నాడా..?

జబర్దస్త్ లో ఒక్కో ఎపిసోడ్ కి ఇంద్రజ తీసుకునే రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా…?

Visitors Are Also Reading