Home » వీల్ చైర్‌కి ప‌రిమిత‌మైన టాలెంటెడ్ న‌టుల గురించి మీకు తెలుసా..?

వీల్ చైర్‌కి ప‌రిమిత‌మైన టాలెంటెడ్ న‌టుల గురించి మీకు తెలుసా..?

by Anji

సాధార‌ణంగా సినీ ఇండ‌స్ట్రీలో చాలా మంది ప‌లు పాత్ర‌లు చేస్తూ ముందుకు వెళ్తుంటారు. కొంత‌మంద మాత్రం అనుకోని కార‌ణాల వ‌ల్ల యాక్సిడెంట్ల‌కు గురై బ‌తికి ఉన్నంత కాలం వీల్ చైర్ల‌కే ప‌రిమిత‌మై ఉన్న కొంత మంది న‌టుల గురించి ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

నూత‌న ప్ర‌సాద్ :

ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు బాపు తెర‌కెక్కించిన అందాల రాముడు సినిమాతో న‌టుడిగా ప‌రిచ‌యం అయిన నూత‌న ప్ర‌సాద్ త‌రువాత చాలా సినిమాల్లో న‌టించి త‌న‌కంటూ గుర్తింపు సంపాదించుకున్నాడు. 101 జిల్లాల అంద‌గాడుగా పేరు తెచ్చుకొని సినిమాల్లో త‌న‌దైన క్యారెక్ట‌రైజేష‌న్ తో ముందుకు సాగుతుండేవాడు. విల‌న్‌గా చేస్తూనే చాలా సినిమాల్లో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా చేశాడు. ఒక రోజు రాజేంద్ర‌ప్రసాద్ హీరోగా వ‌చ్చిన బామ్మ మాట బంగారు బాట సినిమాలో కారు పై నుంచి కింద‌ప‌డే ఓ షార్ట్ తీసే క్ర‌మంలో ఆ కారుకు తాడు క‌ట్టి పైకి లేపారు. ఆ స‌మ‌యంలో తాళ్లు తెగి కారు కింద ప‌డ‌డంతో దాంట్లో ఉన్న రాజేంద్ర‌ప్ర‌సాద్ త‌ప్పించుకున్నాడు. అందులో ఉన్న నూత‌న ప్ర‌సాద్‌కి మాత్రం దెబ్బ‌లు త‌గిలి కాళ్లు ప‌నికి రాకుండా పోయాయి. దీంతో ఆయ‌న వీల్ చైర్ కే ప‌రిమితం అయ్యాడు.

ఇది కూడా చ‌ద‌వండి :  అమ్మారాజ‌శేఖ‌ర్ భార్య ఎవ‌రో తెలుసా..? ఆమె బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్య‌ర్య‌పోవాల్సిందే..!
అను అగర్వాల్ :

ఒక‌ప్పుడు స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ సంపాదించుకుని కుర్ర‌కారు గుండెల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది అను అగ‌ర్వాల్‌. అప్ప‌ట్లో ఆమె తీసిన ఆషికి సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అవ్వ‌డంతో ఆమెకి మంచి క్రేజ్ వ‌చ్చింది. ముఖ్యంగా యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉండేది. ఆ క్రేజ్ తో చాలా సినిమాల్లో హీరోయిన్‌గా న‌టించింది. ప్ర‌ధానంగా మ‌ణిర‌త్నం తీసిన దొంగ దొంగ సినిమాలో మంచి క్యారెక్ట‌ర్‌ని పోషించి త‌న‌దైన న‌ట‌న‌తో గుర్తింపును సంపాదించుకుంది. ఆ త‌రువాత చాలా సినిమాల్లో న‌టిస్తూ జ‌నాల‌ను మెప్పిస్తూ వ‌చ్చింది. అనుకోకుండా ఓ రోజు ఆమెకి కారు యాక్సిడెంట్ కావ‌డంతో ఆమె 20 రోజుల పాటు పాటు కోమాలోనే ఉండిపోయింది. బ‌త‌క‌ద‌నుకున్న స‌మ‌యంలో డాక్ట‌ర్లు శాయ‌శ‌క్తులా కృషి చేసి బ‌తికించారు. ప్ర‌స్తుతం ఆమె శ‌రీరంలో చాలా చోట్ల రాడ్లు వేసే ఉన్నాయి. బీహార్‌లో ఓ యోగా కేంద్రంలో యోగా నేర్చుకుని ప్ర‌స్తుతం ప‌వ‌ర్ లిప్ట‌ర్‌గా చేస్తున్నారు. ఏదైనా మంచి క్యారెక్ట‌ర్ ల‌భిస్తే ప్ర‌స్తుతం సినిమాలు చేయ‌డానికి ఆస‌క్తి చూపిస్తుంటారు.

ఇది కూడా చ‌ద‌వండి :  iBomma : ఐ బొమ్మ‌కి సినిమాలు ఎలా వ‌స్తాయో తెలుసా..?
విద్యాసాగ‌ర్ : 

ఒక‌ప్పుడు కామెడీ సినిమాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా ఉండే జంధ్యాల తీసిన చాలా సినిమాల్లో విద్యాసాగ‌ర్ క‌న‌పిస్తుంటాడు. విద్యాసాగ‌ర్‌ సినిమాల్లో అత‌ని న‌ట‌నతో అంద‌రినీ మెప్పించాడు. అనుకోకుండా ఆయ‌న‌కు ప‌క్ష‌వాతం రావ‌డంతో ఒక కాలు, ఒక చేయి ప‌ని చేయ‌కుండా పోయాయి. దీంతో ఆయ‌న ప్ర‌స్తుతం వీల్ చైర్ లోనే కూర్చుని నాట‌కాల‌ను డైరెక్ట్ చేస్తున్నారు. ఆయ‌న భార్య కూడా యాక్ట‌ర్ అవ్వ‌డంతో ఆయ‌న‌కి హెల్ప్ చేస్తూ ప్ర‌స్తుత జీవితాన్ని గ‌డుపుతున్నారు. ఇక ఆయ‌న భార్య ర‌త్న చాలా సినిమాల్లో సీరియ‌ళ్ల‌లో న‌టిస్తూ మంచి గుర్తింపును సంపాదించారు. ఒంట‌రిగా జీవితంతో యుద్ధం చేస్తూ సినిమా కాకుండా వేరే ప‌నుల్లో బిజీగా ఉంటూ.. వాళ్ల‌కు జ‌రిగిన యాక్సిడెంట్ అనేది మ‌న‌ల్ని ఏం చేయ‌లేద‌ని భావించి వారి సంక‌ల్ప బ‌లంతో వారు త‌మ జీవితాన్ని గ‌డుపుతూ మిగ‌తా వారికి ఆద‌ర్శంగా నిలుస్తున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి :  ప్రేమంటే ఇదేరా..? అమ‌ల చెప్పింద‌ని ఇప్ప‌టికీ ఆ పనిచేస్తున్న నాగార్జున‌..? ఆ ప‌నేంటంటే..!

Visitors Are Also Reading