Home » పెట్రోల్ బంకు ల‌లో ఆరు సేవ‌ల‌ను ఉచితం గా పొంద‌వ‌చ్చు! అవి ఎంటో తెలుసా?

పెట్రోల్ బంకు ల‌లో ఆరు సేవ‌ల‌ను ఉచితం గా పొంద‌వ‌చ్చు! అవి ఎంటో తెలుసా?

by Bunty
Ad

పెట్రోల్ బంకులు కేవ‌లం పెట్రోల్, డిజిల్ ల‌ను స‌ర‌ఫ‌ర చేయ‌డమే కాదు పౌరుల‌కు ఆరు సేవ‌ల‌ను ఉచితం గా అందించాలి. కానీ ఆ సేవలు ఎలాంటివి వాటిని ఎలా వినియోగించు కోవాల‌ని చాలా మందికి తెలియ‌దు. సాధార‌ణం గా పెట్రోల్ బంకు య‌జ‌మానుల‌కు ఈ ఆరు సేవ‌ల‌ను అందిస్తామ‌ని ప్ర‌భుత్వాలు కు తెలుపుతారు. ఈ ఆరు సేవ‌ల‌ను ప్ర‌జ‌లకు ఉచితం గా అందిస్తేనే పెట్రోల్ బంకు ల‌కు ప్ర‌భుత్వాలు అనుమ‌తులు ఇస్తారు. పెట్రోల్ బంకు య‌జ‌మానులు ఈ ఆరు సేవ‌ల‌ను అందించ‌క పోతే వారి పై ఫిర్యాదు చేసే అవ‌కాశం మ‌న‌కు ఉంటుంది. అయితే ఇప్పుడు మ‌నం పెట్రోల్ బంకు వారు ఉచితం గా అందించే ఆరు ఉచిత సేవ‌ల గురించి తెలుసుకుందాం.

Advertisement

1) మూత్ర శాల‌లు, మ‌రుగు దొడ్ల ను స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మం లో భాగం గా పెట్రోల్ బంకు య‌జ‌మానులు త‌ప్ప‌క నిర్వ‌హించాలి. దీని పై కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఆర్డర్స్ జారీ చేసింది. మ‌నం తీసుకుని ప్ర‌తి లీట‌ర్ పెట్రోల్ లో దాదాపు 4 నుంచి 8 పైస‌లు మూత్ర శాల‌లు, మ‌రుగు దొడ్ల నిర్వ‌హ‌న‌కు పెట్రోల్ బంకు య‌జ‌మానులుకు చెల్లిస్తున్నం.

Advertisement

2) పెట్రోల్ బంకు వ‌ద్ద ప్ర‌ధానం గా ప్ర‌జ‌లకు ఉచితం గా మంచి నీటి అందించాలి. దీని కోసం బంకు డీల‌ర్ ఆర్వో యంత్రం, వాట‌ర్ కనెక్ష‌న్ స్వ‌యం గా పొందాలి. కాగ ఏ బంకు లో అయిన వాటర్ సౌక‌ర్యం లేక పోతే ఆ బంకు పై మ‌నం ఫిర్యాదు చేయ‌వ‌చ్చు.

3) ప్ర‌తి వాహానం లో పెట్రోల్ బంకు లో ఉచితం గా గాలి నింపాల్సిందే. దీనికి వినియోగ దారుల నుంచి ఎలాంటి డ‌బ్బులు తీసుకోవ‌ద్దు.

4) వినియోగ‌దారులకు ఎదైనా గాయం అయితే బంకు ల‌లో ప్రథ‌మ చికిత్స చేయాలి. దీనికి సంబంధించి ప్ర‌త్యేక ప్ర‌థ‌మ చికిత్స కిట్ కూడా పెట్రోల్ బంకు ల వ‌ద్ద ఉండాలి.

5) ముఖ్యం గా మ‌న‌కు బంకు ల‌లో పెట్రోల్, డీజీల్ నాణ్య‌త ప్ర‌మాణాల‌ను తెలుసుకునే హ‌క్కు ఉంటుంది.

6) అత్య‌వ‌స‌ర పరిస్థితుల‌లో ప్ర‌జ‌లు పెట్రోల్ బంకు నుంచి ఫోన్ ను వినియోగించ వ‌చ్చు.

Visitors Are Also Reading