భీమ్లానాయక్ సినిమా థియేటర్లలో విడుదల కావడానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉన్నది. తెలంగాణలో సినిమాకు ఐదో షోకు అనుమతులు రావడంతో పాటు పెరిగిన టికెట్ రేట్లు అమలు అవుతుండటంతో తెలంగాణలో సినిమా కలెక్షన్లు రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలున్నాయనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఏపీలో మాత్రం భిన్నమైన పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసినదే. ఏపీలోని పలు ప్రాంతాట్లో టికెట్ ధరల గురించి అధికారులు థియేటర్ల ఓనర్లకు సూచనలు చేస్తూ నోటీసులను పంపుతుండగా. ఆ నోటీసులు మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
పవన్ కల్యాణ్ సినిమా విడుదల సమయంలోనే ప్రభుత్వం కఠినంగా నిబంధనలను అమలు చేస్తోందంటూ కొంత మంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం నిబంధనలు భీమ్లానాయక్ కలెక్షన్లపై ప్రభావం చూపే ఛాన్స్ అయితే ఉంది. వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు పవన్ కల్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాను సపోర్ట్ ట్వీట్ చేశారు. అరచేతిలో సూర్యకాంతిని ఆపలేరు అని చెప్పారు.
Advertisement
యావ్ విత్ భీమ్లా నాయక్ అని రఘురామ కృష్ణం రాజు పేర్కొన్నారు. ఇప్పటికే నిబంధనలు అమలులో ఉండగా.. బెదిరింపు నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని రఘురామకృష్ణంరాజు ప్రశ్నించడం గమనార్హం. రఘురామ కృష్ణం రాజు చేసి ట్వీట్ ను అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తుండగా.. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. భీమ్లానాయక్ సినిమాపై చాలా మంది కెరీర్ ఆధారపడి ఉంది. పవన్‌కు జోడీగా ఈ చిత్రంలో నిత్యామీనన్ నటించారు. మలయాళంలో అయప్పనుమ్‌కోషియమ్ బ్లాక్‌బస్టర్ హిట్ కాగా.. ఆ సినిమా రీమెక్ అయిన భీమ్లానాయక్ కూడా అదే ఫలితాన్ని అందుకుంటుందేమో చూడాలి.
Also Read : భీమ్లానాయక్ పై ఆర్జీవీ సెటైర్లు…పవన్ కు సపోర్ట్ గా పూనమ్ కౌర్…!