Home » భీమ్లానాయ‌క్ పై ఆర్జీవీ సెటైర్లు…ప‌వ‌న్ కు స‌పోర్ట్ గా పూన‌మ్ కౌర్…!

భీమ్లానాయ‌క్ పై ఆర్జీవీ సెటైర్లు…ప‌వ‌న్ కు స‌పోర్ట్ గా పూన‌మ్ కౌర్…!

by AJAY
Ad

టాలీవుడ్ హీరోయిన్ పూన‌మ్ కౌర్ ఎప్పుడూ ఏదో ఒక అశంతో వార్త‌ల్లో నిలుస్తూ ఉంటుంది. అందం అభిన‌యం ఉన్న‌ప్ప‌టికీ పూన‌మ్ కౌర్ హీరోయిన్ గా స‌క్సెస్ అవ్వ‌లేక‌పోయింది. కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలో ఆత్మ‌హ‌త్య‌య‌త్నం చేసుకుని వార్త‌ల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆ త‌ర‌వాత పెద్ద‌గా సినిమాలు చేయ‌లేదు. ఇక పూనమ్ ప్రస్తుతం అడ‌పాద‌డ‌పా సినిమాలు చేస్తున్నా ఆ సినిమాలకు అస‌లు గుర్తింపే లేదు.

ALSO READ : BHEEMLANAYAK : అడ‌విత‌ల్లి పాట పాడినందుకు ఇచ్చింది అంతేనా..?

Advertisement

కానీ సోష‌ల్ మీడియా ద్వారా మాత్రం పూన‌మ్ కౌర్ ఎప్పుడూ త‌న కామెంట్ల‌తో వివాదాల‌లో నిలుస్తూ ఉంటుంది. అంతే కాకుండా పూన‌మ్ ప‌వ‌న్ క‌ల్యాన్ పై ప‌రోక్షంగా ట్వీట్ లు చేస్తూ ఉంటుంది. అప్ప‌ట్లో త‌న‌తో రామ్ గోపాల్ వ‌ర్మ ప‌వ‌న్ పై కామెంట్లు చేసేలా ఉసిగొలిపాడ‌ని వ్యాఖ్యలు చేసింది. క‌త్తి మ‌హేశ్ మ‌ర‌ణించిన సమయంలో దేవుడు శిక్ష‌వేశాడు అంటూ ట్వీట్ చేసింది. ఇదిలా ఉండ‌గా నిన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ హీరోగా న‌టించిన భీమ్లా నాయ‌క్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జ‌రిగిన సంగతి తెలిసిందే.

Advertisement

అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా కేటీఆర్ హాజ‌ర‌య్యారు. కాగా దీనిపై పూన‌మ్ ప‌రోక్షంగా ఓ ట్వీట్ చేసింది. ఎంట‌ర్టైన్ మెంట్ రాజ‌కీయంగా మారింది…రాజ‌కీయాలు ఎంట‌ర్టైన్మెంట్ అవుతున్నాయంటూ త‌న ట్వీట్ లో పేర్కొంది. అంతే కాకుండా నేను మ‌న‌స్పూర్తిగా ఆద‌రించిన ప్రేమించిన వ్య‌క్తులు ఈ రాజ‌కీయ నాయ‌కుల ద‌గ్గ‌ర చేతులు జోడించి ఉండ‌టం…చేతులు క‌ట్టుకుని ఉండ‌టం న‌న్ను బాధించాయి. అవ‌స‌రాల కోసం వ్య‌క్తిత్వం చంపుకోవ‌డం మానేయాలి. అంటూ పూన‌మ్ మ‌రో ట్వీట్ చేసింది.

ఇదిలా ఉండ‌గా భీమ్లా నాయ‌క్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప‌వ‌న్ కల్యాన్ ప్ర‌సంగం అద్భుతం అంటూ రామ్ గోపాల్ వ‌ర్మ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పూన‌మ్ స్పందిస్తూ…ఓ ద‌ర్శ‌కుడు మూల‌న ఉండి ఆయ‌న వ్య‌క్తిగ‌త జీవితాన్ని విమ‌ర్శిస్తూ న‌వ్వుతుంటాడు. మ‌రో ద‌ర్శ‌కుడు రాజ‌కీయంగా ఆయ‌న‌ను విమ‌ర్శిస్తూ ట్విట్ట‌ర్ లో ఆనంద‌ప‌డ‌తాడు అంటూ పేర్కొంది.

Visitors Are Also Reading