Home » Yatra2 Teaser : జగన్ రేంజ్ పెంచేలా యాత్ర 2 టీజర్..తండ్రి పోయాడంటే కొడుకొచ్చాడు..

Yatra2 Teaser : జగన్ రేంజ్ పెంచేలా యాత్ర 2 టీజర్..తండ్రి పోయాడంటే కొడుకొచ్చాడు..

by Bunty
Ad

Yatra 2 Teaser : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జీవిత కథ ఆధారంగా యాత్ర 2 సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరైన మహి వి. రాఘవ్‌ తెరకెక్కించారు. ఈ డైరెక్టర్ కాంపౌండ్ నుంచి 2019 సంవత్సరంలో వచ్చిన పొలిటికల్ జోనర్ ప్రాజెక్ట్ యాత్ర. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి… రాజకీయ ప్రయాణం నేపథ్యంలో వచ్చిన ఈ బయోపిక్ 2019 సంవత్సరంలో బంపర్ హిట్ అందుకుంది.

Yatra 2 Teaser Out

ఈ సినిమాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో మమ్ముట్టి అద్భుతంగా నటించారు. ఇక ఇప్పుడు యాత్ర సినిమాకు సీక్వెల్ యాత్ర రెండవ భాగం వస్తుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, వైయస్సార్ మరణం తర్వాత జరిగిన సంఘటనలు, ఎలా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు… అనే అంశాలను ఇందులో చూపెట్టనున్నారు.

Advertisement

Advertisement

అయితే తాజాగా యాత్ర 2 టీజర్ ను చిత్ర బృందం లాంచ్ చేసింది. ఇందులో జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా నటించారు. అచ్చం జగన్మోహన్ రెడ్డి లాగే… కటౌట్ జీవాకు ఉంది. తాజాగా రిలీజ్ అయిన టీజర్ లో కూడా… స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నటించాడా అనే డౌట్ అందరిలో వచ్చేలా జీవా నటించాడు. కాగా యాత్ర 2 సినిమా ఫిబ్రవరి 8వ తేదీన థియేటర్లలో రిలీజ్‌ కానుంది.

Visitors Are Also Reading