Home » డాడీ చెడోడ్డు అంటున్న యష్ కొడుకు..!

డాడీ చెడోడ్డు అంటున్న యష్ కొడుకు..!

by Azhar
Ad

కన్నడ సూపర్ స్టార్ యష్ గురించి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అందరికి తెలుసు. అందుకు కారణమా కేవలం ఒక్క సినిమా. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన కెజిఎఫ్ అనే సినిమా ఎంతో పెద్ద విజయం సాధించింది. ఇక ఆ తర్వాత కెజిఎఫ్ చప్టార్ 2 కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూడాల్సి వచ్చింది. కరోనా కారణంగా సినిమా విడుదల మరింత ఆలస్యం అయ్యింది. ఇక ఈ ఏడాది ఎట్టకేలకు విడుదలైన కెజిఎఫ్ చప్టార్ 2 అనే సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. మొత్తం పాన్ ఇండియా లెవల్ లో 1000 కోట్లకంటే ఎక్కువ కలెక్ట్ చేసి తన సత్తా ఏంటో చూపించింది.

Advertisement

అయితే ఈ సినిమాకు కేవలం కర్ణాటకలోనే కాకుండా.. అన్ని భాషలో మరో సినిమా అనేది ఎదురు నిలబడలేకపోయింది. ఇక ఈ సినిమా యష్ కు ఇచ్చిన ఎలివేషన్స్ అందర్నీ ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎంత బిజీగా ఉన్న కూడా యష్ తన కుటుంబానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడు. ఇక సమయం దొరికిన ప్రతిసారి వెకేషన్స్ కు వెళ్తూ వస్తాడు. అలాగే యష్ భార్య రాధికా కూడా ఎప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఆమెకు ఇంస్టాగ్రామ్ లో 2.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అంటేనే అర్ధం చేసుకోవచ్చు. అయితే ఈరోజు రాధికా తన ఇంస్టాలో ఓ వీడియో అనేది పోస్ట్ చేసింది.

Advertisement

అందులో యష్ కొడుకు నువ్వు బ్యాడ్ అంటూ చెబుతున్నాడు. అయితే బ్రెష్ చేయడంలో మారం చేస్తున్న తన కొడుకును యష్ కొంచెం మందలించడంతో అమ్మను పట్టుకొని కొంచెం ఏడవడం ప్రారంభించాడు. ఆ తర్వాత అమ్మ గుడ్.. నాన్న బ్యాడ్ అంటూ కామెంట్స్ చేసాడు. ఆ తర్వాత యష్ కాదు నాన్న గుడ్ అన్ని ఎన్నిసార్లు చెప్పిన ఒప్పుకోవడానికి అసలు సిద్ధంగా లేడు. ఎన్నిసార్లు అడిగిన నాన్న బ్యాడ్ అనే చెబుతున్నాడు. ఇక ఆఖరికి యష్ నాన్న బెస్ట్ అని చెప్పాడు. కానీ కొడుకు మాత్రం ఒప్పుకోలేదు. ప్రస్తుతం రాధికా పోస్ట్ చేసిన ఈ వీడియో అనేది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

పంత్ విషయంలో మళ్ళీ వక్ర బుద్ధి చూపించిన ఇంగ్లాండ్ బోర్డు..!

రీ-ఎంట్రీ ఇస్తా అంటున్న పాక్ పేసర్ మహమ్మద్ అమీర్…!

Visitors Are Also Reading