Home » షర్మిల కి రాజకీయంగా చెక్ పెట్టడానికి జగన్ ప్లాన్ ఇదే ! అదిరింది గా ?

షర్మిల కి రాజకీయంగా చెక్ పెట్టడానికి జగన్ ప్లాన్ ఇదే ! అదిరింది గా ?

by Srilakshmi Bharathi
Ad

ఆంధ్ర ప్రదేశ్ లో పొలిటికల్ హీట్ పెరుగుతూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా అధికార వైసీపీ పార్టీని ఓడించాలని గట్టిగానే కంకణం కట్టుకున్నాయి. ఇక, చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలోనే జనసేన, టీడీపీ పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు ఆంధ్ర ప్రదేశ్ లో పెద్దగా ఉనికిలో లేని కాంగ్రెస్ పార్టీ కూడా స్ట్రాంగ్ గా ఫైట్ చెయ్యాలని సిద్ధం అవుతోంది. ఈ క్రమం లోనే కాంగ్రెస్ పార్టీ వై ఎస్ జగన్ సోదరి షర్మిలకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

ఆమె కడప నుంచి ఏపీ కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. దీనితో.. కడప నుంచి వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారు అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. కడప పార్లమెంట్ పొజీషన్ అనేది వై ఎస్ కుటుంబానికి అడ్డా. ఇప్పటి వరకు ఆ స్థానం నుంచి వై ఎస్ ఆర్, వివేకానంద రెడ్డి, వై ఎస్ జగన్, వై ఎస్ అవినాష్ రెడ్డి లు గెలుపొందుతూ వచ్చారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఆ స్థానం నుంచి అవినాష్ రెడ్డిని తప్పించాలని జగన్ చూస్తున్నట్లు తెలుస్తోంది.

అవినాష్ రెడ్డిని కడప ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని జగన్ భావిస్తున్నారని వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ క్రమంలో.. కడప స్థానం నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారు? అన్న విషయమై చర్చలు జరుగుతున్నాయి. ఈ స్థానం నుంచి వై ఎస్ భారతి పోటీ చేసే అవకాశం ఉంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే.. వై ఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపు ఖాయమైన నేపథ్యంలో.. వై ఎస్ జగన్ రాజకీయ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు అన్న సంగతి తేలాల్సి ఉంది.

 తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading