Home » సాహాకు బ్యాడ్ టైం.. అన్ని గొడవలే..!

సాహాకు బ్యాడ్ టైం.. అన్ని గొడవలే..!

by Azhar
Ad

భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే గత ఏడాది నుండి భారత తుది జట్టులో స్థానం సంపాదించలేకపోతున్న సాహా.. ఈ మధ్య ఏకంగా జట్టు నుండే బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత గంగూలీ పైన భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ పైన సంచలన వ్యాఖ్యలు చేసాడు. అవి అప్పట్లో దూరం రేపాయి. ఇక ఆ మధ్యే ఓ జర్నలిస్ట్ నన్ను బెదిరించాడు అని ట్విట్ చేయగా.. దానిని సీరియస్ గా తీసుకున్న బీసీసీఐ ఓ కమిటీని వేసి విచారణ జరపగా… సాహా చెప్పింది నిజమే అని తేలింది. దాంతో ఆ జర్నలిస్ట్ పై బ్యాన్ విధించింది బీసీసీఐ.

Advertisement

అయితే ఇప్పుడు ఏం సమస్యలు సాహాకు లేవు అనుకుంటుంటే.. ఇప్పుడు మరో గొడవతో వార్తల్లోకి ఎక్కాడు సాహా. ఆ మధ్య వ్యక్తిగత కారణాలతో రంజీ ట్రోఫీ కి దూరంగా ఉండటమే ఇప్పుడు సాహాకు కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. రంజీల్లో బెంగాల్ కు ఆడుతాడు సాహా. కానీ ఇప్పుడు ఆ బెంగాల్ క్రికెట్ బోర్డు జాయింట్ సెక్రటరీ దేవద్రతా దాస్‌తో సాహాకి విబేధాలు వచ్చాయి. సాహా రంజీ ట్రోఫీ కి దూరంగా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని… దేవద్రతా తప్పు బట్టాడు. ఎలా అలా నిర్ణయం తీసుకుంటావ్ అని ప్రశ్నించాడు. ఇప్పటికే టీం ఇండియాలో చోటు కోల్పోయి కోపంగా ఉన్న సాహాకు ఈ వ్యాఖ్యలు నచ్చలేదు.

Advertisement

దాంతో దేవద్రతా వ్యాఖ్యల పై సీరియస్ అయిన సాహా.. తా నిర్ణయాన్ని తప్పుబట్టి అవమానించారని.. అందుకు దేవద్రతా అందరి ముందు తనకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు. అలాగే ఈ గొడవతో ఏకంగా బెంగాల్ క్రికెట్ బోర్డు నుంచి బయటికి రావాలని నిర్ణయిచుకున్నాడు. ఈ విషయంలోనే బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన అవిషేక్ దాల్మియాని కలిసి.. తనకు బయటకు వెళ్లేందుకు ఎన్‌వోసీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తుంది. ఇది ఎలా ఉన్న ప్రస్తుతం ఐపీఎల్ లో గుజరాత్ టైటాన్స్ జట్టుకు ఆడుతున్న సాహా మాత్రం అదరగొడుతున్నాడు.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ లో మరో అంపైర్ తప్పిదం.. బలైన మాథ్యూ వేడ్..!

కోహ్లీ అంత గొప్ప కెప్టెన్ కాదు అంటున్న సెహ్వాగ్.. ఎందుకంటే..?

Visitors Are Also Reading