తెలుగు ఇండస్ట్రీ లోనే ఆల్ రౌండర్ నటుడిగా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగి పోయే నట సార్వభౌమ ఎన్టీఆర్. ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు. ఆయన సినిమాలే కాకుండా రాజకీయాల్లో కూడా సంచలనం సృష్టించారు. సినీ రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఆయన, రాజకీయంతో ప్రజలకు ఎంతో మేలు చేసిన ఘనత సీనియర్ ఎన్టీఆర్ కే దక్కుతుంది అని చెప్పవచ్చు. ఆయన లవకుశ, మాయాబజారు,యమగోల, అడవి రాముడు ఇలాంటి సినిమాలు ఆ సమయంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.త్రివిక్రమరావు మరియు సీనియర్ ఎన్టీఆర్ అన్నదమ్ములు అయిన వీరిద్దరూ రామలక్ష్మణులలా ఉండేవారని చాలామంది అంటుంటారు. వీరిద్దరి మధ్య వయసు వ్యత్యాసం మూడు సంవత్సరాలు అయినా తమ్ముడంటే ఎన్టీఆర్ కు చాలా అభిమానం ఉండేది. త్రివిక్రమ రావుకు కూడా ఎన్టీఆర్ అంటే ఎంతో గౌరవం,ప్రేమ ఉండేది. ఇందులో ఒకటి ఏదైనా విషయాన్ని అనుకుంటే మరొకరు ఆ విషయాన్ని ఆచరణలో పెట్టేసేవారు. అంటే వీరిద్దరి మధ్య అంత అనుబంధం ఉందని అర్థం చేసుకోవచ్చు. ఇందులో సీనియర్ ఎన్టీఆర్ బి.ఏ చదివినా త్రివిక్రమరావు మాత్రం ఏమీ చదువుకోలేదు. ఎన్టీఆర్ కు సినిమాల్లో అవకాశాలు వస్తున్న తరుణంలో సినిమా ఇండస్ట్రీ లోకి వెళ్లాలా వద్దా అని కన్ఫ్యూజ్ లో ఆయన పడ్డారట. ఈ తరుణంలోనే త్రివిక్రమరావు ఎన్టీఆర్ ను ప్రోత్సహించి గాడిలో పెట్టారు. ఎన్టీఆర్ ఇండస్ట్రీకి వచ్చిన సమయంలో అవకాశాలు మాత్రం రాలేదు. ఈ సమయంలోనే త్రివిక్రమరావు ఎన్టీఆర్ కు ధైర్యాన్ని అందించి చాలా ప్రోత్సహించారు. ఆస్తిలో తన యొక్క వాటాను కూడా తమ్ముడికి రాసి ఇచ్చి తమ్ముడి పెళ్లి కి ఏ ఇబ్బందులు రాకుండా ఎన్టీఆర్ చూసుకున్నారు. అయితే ఎన్టీఆర్ తన కుటుంబాన్ని ఏవిధంగా చూసుకునేవారు తన తమ్ముడి కుటుంబాన్ని కూడా అదేస్థాయిలో చూసుకునేవారు. ఎన్టీఆర్ 1996లో మరణించగా, త్రివిక్రమరావు మాత్రం 1998లో మృతి చెందారు.
Advertisement
ALSO READ;
Advertisement
టీవీ షోలు చేసి నాగబాబు ఇన్ని కోట్లు సంపాదించారా.. ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..?
ఒకప్పటి అందాల రాశి దివ్యభారతి చనిపోయిన రోజు అర్థరాత్రి ఏం జరిగిందో తెలుసా …!