Home » టీవీ షోలు చేసి నాగబాబు ఇన్ని కోట్లు సంపాదించారా.. ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..?

టీవీ షోలు చేసి నాగబాబు ఇన్ని కోట్లు సంపాదించారా.. ఆయన ఆస్తుల విలువ ఎంతంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఇందులో నాగబాబు విషయానికి వస్తే ఆయన నటుడిగా ఎన్నో సినిమాలు చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పటికీ మంచి పాత్రలు వస్తే నటిస్తూ వస్తున్నారు. కానీ ఆయన సినిమాల కంటే ఎక్కువ పలు టీవీ షోస్ లో కనిపిస్తూ ఉంటారు. ఆ షోలలో ఆయన జడ్జి గా వ్యవహరిస్తూ అందరిని మెస్మరైజ్ చేస్తారు. ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు 2024లో ఎన్నికల్లో పోటీ చేస్తారని అనేక వార్తలు వచ్చాయి. దీనిపై నాగబాబు క్లారిటీ ఇవ్వడంతో ఆయన అభిమానులు కూడా ఇక పోటీ చేయారని ఫిక్స్ అయిపోయారు.

 

Advertisement

Advertisement

ఇటీవల నాగబాబు సర్కారు వారి పాట సినిమాలో కూడా ఒక చిన్న పాత్రలో చేసి అభిమానుల మెప్పు పొందారు. ఈ విధంగా నాగబాబు ఎన్నో సినిమాలలో చేసి మంచి నటుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. అలాగే ఆయన పలు సినిమాలకు నిర్మాతగా కూడా చేసాడు. ఆరెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో నాగబాబు సినిమాల్లో నటించడం చాలా తగ్గించారు. తన ఇంట్లో అంత మంది స్టార్ హీరోలు ఉన్నా ఇప్పటికీ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కాలేదు. అయితే ఈ ఏడాది ప్రవీణ్ సత్తారు మరియు వరుణ్ తేజ్ కాంబినేషన్లో రాబోతున్న ఒక సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు అని తెలుస్తోంది.ఆయన కొన్ని రియాలిటీ షోలలో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి తన పాపులారిటీని పెంచుకున్నారు. ఇక రాజకీయం విషయానికి వస్తే జనసేన పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావడానికి నాగబాబు చాలా కష్టపడుతున్నారు. అయితే నాగబాబు ఆస్తుల విలువ ప్రస్తుతం మార్కెట్ ప్రకారం చూస్తే 100 కోట్లకు అటు ఇటుగా ఉండవచ్చని సమాచారం. 2019 ఎన్నికల సమయంలో నాగబాబు భార్య కి 41 కోట్ల చరాస్తులు, స్థిరాస్తులు ఉన్నాయని నాగబాబు వెల్లడించారు. అయితే ఆయన ఇప్పుడు తీయబోయే వరుణ్ తేజ్ సినిమాతో నైనా ప్రొడ్యూసర్ గా విజయం అందుకుంటాడో లేదో చూడాలి.

 

ALSO READ;

అనిల్ రావిపూడి తో జరిగిన గొడవ వల్లే తమన్నా ఎఫ్- 3 ప్రమోషన్స్ కు దూరంగా ఉందా….అసలేం జరిగిందంటే..!

హీరో వడ్డే నవీన్ సినిమాలు తీయకపోవడానికి కారణం ఎవరో తెలుసా..!!

 

Visitors Are Also Reading