Home » ఐఎండీబీ రేటింగ్ ప్రకారం వ‌ర‌స్ట్ సినిమాలు ఇవే..? అన్నింటికంటే వ‌రస్ట్ సినిమా ఏదంటే..?

ఐఎండీబీ రేటింగ్ ప్రకారం వ‌ర‌స్ట్ సినిమాలు ఇవే..? అన్నింటికంటే వ‌రస్ట్ సినిమా ఏదంటే..?

by AJAY
Published: Last Updated on
Ad

సాధార‌ణంగా సినిమా విడుద‌ల‌య్యాక ఆ సినిమా ఎలా ఉంద‌ని గూగుల్ లో వెతికితే చాలా రివ్య్యూలు వ‌స్తాయి. ఎన్నో వెబ్ సైట్స్ లో రివ్య్యూలు ఉంటాయి. అయితే అలాంటి రివ్యూల‌లో నిజాయితీ శాతం త‌క్కువ‌. కానీ ఐఎండీబీ అనే వెబ్ సైట్ ఇచ్చే రివ్యూలను చాలా మంది విశ్వ‌సిస్తారు.

Advertisement

ఈ సైట్ లో ఎక్కువ మంది ప్రేక్ష‌కుల‌కు న‌చ్చిన సినిమాల‌కు ఎక్కువ రేటింగ్ ఇస్తే న‌చ్చ‌ని సినిమాల‌కు త‌క్కువ రేటింగ్ ను ఇస్తుంటారు. కాగా ఒక‌ప్ప‌టి నుండి ఇప్ప‌టి వ‌ర‌కూ ఐఎంబీడీ అతిత‌క్కువ రేటింగ్ ఇచ్చిన సినిమాలు ఏవో ఇప్పుడు చూద్దాం…ఐఎండీబీలో త‌క్కువ రేటింగ్ భ‌యం సినిమాకు ఇచ్చారు.

Also Read:  త్వరలో సమంత పెళ్లి ఫిక్స్.. అబ్బాయిని కూడా డిసైడ్ చేసిన సద్గురు స్వామీజీ..నిజమేనా..?

ఈ సినిమాకు 2.0 రేటింగ్ ఇచ్చారు. మ‌రియు లైగ‌ర్ సినిమాక కూడా కేవ‌లం 2.0 రేటింగ్ ఇచ్చారు. అంతే కాకుండా బాల‌య్య హీరోగా న‌టించిన విజయేంద్ర‌వ‌ర్మ సినిమాకు కూడా ఐఎండీబీ రేటింగ్ 2.0గానే ఉంది. జ‌బ‌ర్ద‌స్త్ ద్వారా క‌మెడియ‌న్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ‌క‌ల‌క శంక‌ర్ హీరోగా అవ‌తారం ఎత్తిన సంగ‌తి తెలిసిందే. శంక‌ర్ ఎక్కువ‌గా త‌న స్కిట్స్ లో ద‌ర్శ‌కుడు ఆర్జీవీని ఇమిటేట్ చేసేవాడు.

Advertisement

ఇక ఆర్జీవీ జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ప‌రాన్న జీవి సినిమాలో శంక‌ర్ న‌టించాడు. ఈ సినిమాకు కూడా ఐఎండీబీ 2.0 రేటింగ్ ను ఇచ్చింది. బాల‌య్య కెరీర్ లో వ‌చ్చిన మ‌రోఫ్లాప్ సినిమా మ‌హార‌థి కాగా ఈసినిమాకు కూడా ఐఎండీబీ 2.0 రేటింగ్ మాత్ర‌మే ఇచ్చింది. బాల‌య్య హీరోగా న‌టించిన ప‌ర‌మ‌వీర‌చ‌క్ర సినిమాకు ఐఎంబీడీ దారుణ‌మైన రేటింగ్ ను ఇచ్చింది.

Also Read:  ఆ మూవీ తీయాలని హీరో కృష్ణ తల్లి చివరి కోరిక.. కానీ మూవీ100 రోజుల ఫంక్షన్ కి ముందే అలా కావడం దారుణం..!!

ఈ చిత్రానికి కేవ‌లం 1.8 రేటింగ్ ను ఇచ్చింది. బాల‌య్య కెరీర్ లో వ‌చ్చిన మ‌రో డిజాస్ట‌ర్ సినిమా ఒక్క‌మ‌గాడుకు కూడా దారుణ‌మైన రేటింగ్ వ‌చ్చింద‌. ఈసినిమాకు ఐఎండీబీ ప్రాకారం 1.8 రేటింగ్ మాత్రమే ఉండ‌టం విశేషం. మోహాన్ బాబు ర‌గిలే గుండెలు సినిమాకు కూడా దారుణ‌మైన రేటింగ్ వ‌చ్చింది. ఐఎండీబీ ప్రాకారం ఈ సినిమాకు 1.3 మాత్రమే రేటింగ్ ఉంది.

Also Read:  హిట్లర్ సినిమా ముందు ఆ హీరోకి వెళ్లిందట.. కానీ ఆ కారణం వల్లే చిరంజీవికి వచ్చిందా..?

Visitors Are Also Reading