Home » హిట్లర్ సినిమా ముందు ఆ హీరోకి వెళ్లిందట.. కానీ ఆ కారణం వల్లే చిరంజీవికి వచ్చిందా..?

హిట్లర్ సినిమా ముందు ఆ హీరోకి వెళ్లిందట.. కానీ ఆ కారణం వల్లే చిరంజీవికి వచ్చిందా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా నటనా టాలెంటుతో స్టార్ గా మారిన హీరో ఎవరైనా ఉన్నారు అంటే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది మెగాస్టార్ చిరంజీవి.. ఆయన ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీసి సూపర్ హీరో గా మారిపోయారు.. ఇప్పటికే 150 కి పైగా చిత్రాల్లో నటించి హౌరా అనిపించారు.. ప్రస్తుతం ఆయన వివిధ చిత్రాల్లో నటిస్తూ కుర్ర హీరోలకు కూడా పోటీ ఇచ్చి ముందుకు సాగుతున్నారని చెప్పవచ్చు.. అలాంటి చిరంజీవి సినీ ప్రయాణంలో ఎన్నో హిట్లు ఎన్నో ఫ్లాప్ లు కూడా ఉన్నాయి.. చిరంజీవి నటించిన ప్రధానమైన చిత్రాల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హిట్లర్ మూవీ..

Advertisement

also read:ఎన్టీఆర్ పై ట్వీట్ చేసిన బాలీవుడ్ బ్యూటీ.. నెటిజ‌న్లు ట్రోల్స్‌..!

Advertisement

ఈ సినిమాలో చిరంజీవి డిఫరెంట్ రోల్లో నటించారు.. ఐదుగురు చెల్లెళ్లను కంటికి రెప్పలా చూసుకుంటూ కుటుంబ బాధ్యతలు మోసే పాత్రలో నటించి అందరిని మెస్మరైజ్ చేశారు. అలాంటి హిట్లర్ సినిమా మలయాళంలో 1996లో మమ్ముట్టి హీరోగా సిద్దెంకి దర్శకత్వంలో వచ్చింది.. అయితే ఈ మూవీ యొక్క రీమేక్ హక్కులను నిర్మాత, ఎడిటర్ మోహన్ కొనుగోలు చేసారట.. కానీ ఈ సినిమాని ముందుగా మోహన్ బాబుతో ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారట.. కానీ మోహన్బాబు అప్పటికే చాలా సినిమాలతో బిజీగా ఉండటం డేట్స్ కుదరక పోవడంతో..

ఈ మూవీ కాస్త చిరు చేతికి వచ్చింది.. ఈ క్రమంలో ఈ సినిమా ఇవివి కాకుండా, ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించి హీరో ఇమేజ్ కు తగ్గట్టుగా కథలో మార్పులు కూడా చేసి తెరకెక్కించారు.. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించిందని అందరికీ తెలుసు.. ప్రస్తుతం చిరు గాడ్ ఫాదర్ సినిమాలో కూడా నటిస్తున్నారు. దీనికి దర్శకుడిగా నిర్మాత మోహన్ కుమారుడు మోహన్ రాజా తెరకెక్కిస్తున్నారు.. సినిమా షూటింగ్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

also read:ఆ మూవీ తీయాలని హీరో కృష్ణ తల్లి చివరి కోరిక.. కానీ మూవీ100 రోజుల ఫంక్షన్ కి ముందే అలా కావడం దారుణం..!!

Visitors Are Also Reading