Home » మ‌న‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టిన ఉపాస‌న‌..!

మ‌న‌సులో ఉన్న కోరిక‌ను బ‌య‌ట‌పెట్టిన ఉపాస‌న‌..!

by Anji
Ad

మెగా కోడలిగా అపోలో హాస్పిటల్ చైర్ పర్సన్ గా ఎన్నో బరువు బాధ్యతలను తీసుకొని వాటిని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్న మెగా కోడలు ఉపాసన గురించి అందరికీ తెలిసిన విష‌య‌మే. ఈమె అపోలో హాస్పిటల్ బాధ్యతలను నిర్వహిస్తూనే సోషల్ మీడియా వేదికగా అభిమానులను నిత్యం ఆరోగ్య విషయాల గురించి తెలియజేస్తుంటారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్న వారు ఈ కార్యక్రమంలో రామ్ చరణ్ ప్రస్తుతం తన 15వ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

Advertisement

ఆచార్య సినిమా విడుదలైన వెంటనే రామ్ చరణ్ తన 15వ సినిమా షూటింగ్ లో బిజీ గా అయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుంది. రామ్ చరణ్ తన తదుపరి సినిమాలో బిజీగా ఉండటంతో తన సోషల్ మీడియా వేదికగా తన మనసులో ఉన్న కోరికను బయటపెట్టింది. మండుతున్న ఎండల నుంచి ఉపశమనం పొందడం కోసం తనకు ఎక్కడికైనా చల్లని ప్రదేశానికి వెళ్లాలని ఉందంటూ ఉపాసన తన కోరికని తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ఈ త‌రుణంలో ఈ పోస్ట్ పై రాంచరణ్ స్పందిస్తూ.. నాకు కూడా వెకేషన్ వెళ్లాలని ఉంది కాకపోతే ఏం చేయను కొన్ని రోజులు వేచి ఉండక తప్పదు అంటూ ఉపాసనను టాగ్ చేశారు.

Advertisement

ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా వీరిద్దరూ పరస్పరం ఒకరిపై మరొకరు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ చేసుకోవడంతో ఈ పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గత కొద్ది రోజుల క్రితం ఉపాసన రామ్ చరణ్ హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేసిన సంగతి తెలిసిన‌దే. అదేవిధంగా ఆఫ్రికా అడ్వెంచరస్ టూర్ కి వెళ్లారు ఈ జంట. అక్కడ తీవ్రమైన మృగాల మధ్య సవారీ చేస్తూ ఎంజాయ్ చేసారు.

Also Read : 

భళా తంధాననా ఓటీటీ రైట్స్, రిలీజ్ డేట్, సాటిలైట్ రైట్స్

రుద్రాక్షలు ధరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!!

Visitors Are Also Reading