Home » విజయ్ దేవర కొండకి షాక్ ఇచ్చిన “వరల్డ్ ఫేమస్ లవర్” ప్రొడ్యూసర్స్.. నీది పెద్ద మనసే.. కానీ?

విజయ్ దేవర కొండకి షాక్ ఇచ్చిన “వరల్డ్ ఫేమస్ లవర్” ప్రొడ్యూసర్స్.. నీది పెద్ద మనసే.. కానీ?

by Srilakshmi Bharathi
Ad

నటుడు విజయ్ దేవరకొండ 100 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి లక్ష రూపాయలు అందచేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. “ఖుషి” సినిమా విజయంలో అభిమానులను కూడా భాగస్వామ్యం చేయాలనీ భావిస్తున్నట్లు ప్రకటించాడు. అయితే.. ఈరోజు ట్విట్టర్ హేండిల్ ద్వారా అర్హత పొందేందుకు అవసరమైన వారి వివరాలను తనకు పంపవలసిందిగా అభ్యర్థించాడు. ఖుషి విజయం పట్ల విజయ్ స్పందన అందరిని ఆకట్టుకుంది. కానీ, “వరల్డ్ ఫేమస్ లవర్” ప్రొడ్యూసర్స్ అభిషేక్ నామాకు మాత్రం నచ్చనట్లు ఉంది.

Vijay D sharing 1 crore rupees for 100 families

Advertisement

అభిషేక్ నామా ప్రొడక్షన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ అయిన అభిషేక్ పిక్చర్స్ యొక్క ట్విట్టర్ హేండిల్ తాజాగా ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. ఈ ట్వీట్ విజయ్ దేవర కొండను పరోక్షంగా టార్గెట్ చేసినట్లు ఉంది. “డియర్ విజయ దేవరకొండ, #WorldFamousLover పంపిణీలో మేము 8 కోట్లను కోల్పోయాము, కానీ దానిపై ఎవరూ స్పందించలేదు!! ఇప్పుడు మీరు మీ పెద్ద హృదయంతో కుటుంబాలకు 1CR విరాళం ఇస్తున్నందున, దయచేసి మమ్మల్ని మరియు మా ఎగ్జిబిటర్స్ & డిస్ట్రిబ్యూటర్స్ కుటుంబాలను కూడా (sic) రక్షించాలని అభ్యర్థిస్తున్నాము మరియు ఆశిస్తున్నాము” అని ట్వీట్ చేసారు.

Advertisement

ఫిబ్రవరి 14, 2020న వాలెంటైన్స్ డే ట్రీట్‌గా విడుదలైన వరల్డ్ ఫేమస్ లవర్ విజయ్ కెరీర్‌లో అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అయితే 3 సంవత్సరాల తర్వాత విజయ్‌పై అభిషేక్ నామా విమర్శలు చేయడం మాత్రం అందరిని షాక్ కి గురి చేస్తోంది. అయితే ఈ వివాదాస్పద ట్వీట్‌పై విజయ్ ఇంకా స్పందించలేదు. నెటిజన్స్ మాత్రం తలోరకంగా స్పందిస్తున్నారు. ఇదే ప్రశ్న ఇతర స్టార్ హీరోల సినిమాలు డిజాస్టర్ అయితే… ఏ డిస్ట్రిబ్యూషన్ సంస్థ అయినా ప్రశ్నించగలడా? అని ఇతర నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అభిషేక్ నామా విజయ్ దేవర కొండని కామెంట్స్ చేయడం మాత్రం అతని అభిమానులతో సహా ఇతర నెటిజన్స్ కూడా వ్యతిరేకిస్తున్నారు.

Visitors Are Also Reading