తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు డైరెక్టర్లుగా మారి ఎన్నో సినిమాలను మనకు అందించారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన మహిళ డైరెక్టర్లు ఎవరో మనం కూడా ఒక లుక్కేద్దాం..
సావిత్రి:
Advertisement
Also Read:రవితేజ రావణాసురాలో సీతమ్మపై డైలాగ్.. తల్లిని అవమానిస్తారా అంటూ ట్రోల్స్..!!
చిన్నారి పాపలు అనే చిత్రం ద్వారా హీరోయిన్ సావిత్రి మెగా ఫోన్ పట్టుకుంది. అలాగే మరికొన్ని చిత్రాలకు దర్శకత్వం వహించి నటిగానే కాకుండా దర్శకురాలిగా ఎన్నో చిత్రాలను అందించింది..
విజయనిర్మల :
విజయనిర్మల మీనా అనే చిత్రానికి తొలిసారి దర్శకత్వం వహించి దర్శకురాలిగా మారింది. అంతే కాదు విజయనిర్మల ఎక్కువ సినిమాలకు దర్శకత్వం వహించిన తొలి మహిళగా గిన్నిస్ రికార్డు లోకి కూడా ఎక్కింది.
జీవిత రాజశేఖర్ :
Advertisement
Also Read:Mar 8th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!
ఈమె తన భర్త హీరోగా చేసిన ఎవడైతే నాకేంటి,ఆప్తుడు, శేషు, సత్యమేవ జయతే వంటి సినిమాలకు దర్శకత్వం వహించింది.
రేణు దేశాయ్ :
పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణు దేశాయ్ కూడా సొంతంగా స్టోరీ రాసుకొని ఇష్క్ వాలా లవ్ అనే సినిమాని చేసి దర్శకురాలిగా మారింది.
రేవతి:
ఈమె పేరు చెప్తే తెలియని వారు ఉండరు. కన్నడ, తెలుగు, తమిళ ఇండస్ట్రీలో సినిమా హీరోయిన్గా మంచి గుర్తింపుతెచ్చుకుంది. చివరికి డైరెక్టర్ గా మారి కేరళ కేఫ్, ముంబై కటింగ్, వంటి ఎన్నో సినిమాలకు డైరెక్షన్ చేసింది.
Also Read:ఇండస్ట్రీ హిట్ లాంటి ‘సమరసింహ రెడ్డి’ సినిమాలో ఒక్క సీన్ బాగోలేదని వదిలేసిన హీరోయిన్ ఎవరంటే ?