Home » Mar 8th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

Mar 8th 2023 Top News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

హైదరాబాద్ దబీర్ పురా పోలీస్ స్టేషన్ పరిధిలోని నూర్ ఖాన్ బజార్ లో సిల్వర్ హైట్ రెసిడెన్షియల్ బిల్డింగ్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దాంతో గౌలీగూడ, సాలార్ జంగ్ మ్యూజియం ఫైర్ స్టేషన్ల సిబ్బంది మంటలు ఆరౌతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేసింది. రేపు ఢిల్లీకి రావాలని నోటీసులు ఇచ్చారు. నిన్న రామచంద్ర పిళ్ళై అరెస్ట్ అయ్యారు.. రిమాండ్ రిపోర్టులో కవిత పేరు ఈడీ ప్రస్తావించింది. ఇప్పటివరకూ ఈ కేసులో 11 మంది అరెస్ట్ అయ్యారు.

Advertisement

జెరూసలేం పాలస్తీనియన్లపై ఇజ్రాయెల్ సైన్యం కాల్పులు జరుపుతోంది. ఆరుగురు పాలస్తీనీయన్లు ఈ దాడిలో చనిపోయారు.

అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మహిళామణులందరికీి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు.

corona omricon

corona omricon

పశ్చిమబెంగాల్ లో ఎడినో వైరస్ బాధితులు పెరుగుతున్నారు. గత రెండునెలల్లో శ్వాస సమస్యలతో 19 మంది చిన్నారులు మృతి చెందారు.

Advertisement

తిరుమలో విజయవంతమైన టీటీడీ ఫేస్ రికగ్నిషన్ విధానం. భక్తులు పెరిగినా గదుల లభ్యత అవకాశం ఉంది. ఉచిత లడ్డూ టోకెన్లు దర్శనానికి వెళ్ళిన భక్తులకు మాత్రమే కేటాయించే వెసులుబాటు కలగనుంది.

విశాఖ భారత్-ఆస్ట్రేలియా వన్డే కోసం ఈనెల 10నుంచి ఆన్ లైన్లో టిక్కెట్ల అమ్మకం జరగనుంది.13నుంచి ఆఫ్ లైన్లో మ్యాచ్ టిక్కెట్లు అందుబాటులో ఉంటాయి. రూ,600 నుంచి రూ6 వేల మధ్య టిక్కెట్ రేట్లు నిర్ణయించారు.

జనసేన పార్టీపై మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. జనసేన అమ్మకానికి పెట్టిన పార్టీ అన్నారు. కాపులకు పట్టిన శని పవన్‌ కల్యాణ్‌ అంటూ అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.

విశాఖపట్నం లోని సింహాచలం దేవస్థానంలో 1089నాటి శాసనం వెలుగు చూసింది. స్వచ్ఛమైన తెలుగు అక్షరాలు, అంకెలతో శాసనం ఉంది. మైసూరుకు చెందిన ఎపిగ్రఫీ.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాసనం ను నిర్ధారించింది.

Visitors Are Also Reading