గొప్ప ఆర్థికవేత్త , మేధావి ఆచార్య చాణక్యుడు తన విధానాలతో ఎంతో ప్రసిద్ధి పొందాడు. ఆచార్య చాణక్యుడికి సమాజం పట్ల లోతైన అవగాహన ఉన్నది. పూర్వం ఎప్పుడో ఆయన రచించిన గ్రంథాలు ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యంలో ఉన్నాయంటే ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
Advertisement
వీటిలో అతను చెప్పిన వాటిని అనుసరించిన వారు ఎంతో సంతోషంగా, విజయవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. చాణక్యుడి విధానాలు నేటి కాలంలో కూడా ఎంతో అనుసరణీయమని చెప్పాలి. తన విధానాలను అనుసరించే వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ అపజయాన్ని ఎదుర్కోవనసరం లేదని నమ్ముతుంటారు. మీరు ఎవరినైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే వారి బాహ్య సౌందర్యాన్ని చూడకూడదు. అంతర్గత లక్షణాలను కూడా చూడాలని చాణక్యుడు తన నీతి గ్రంథంలో పేర్కొన్నాడు.
ఆచార్య చాణక్య చెప్పినట్టుగా తాను అనుసరించే ధర్మ శాస్త్రాలు.. వేదాలపై జ్ఞానం ఉన్నటువంటి జీవితభాగస్వామి లభిస్తే అతడు నిజంగా అదృష్టవంతుడని చెప్పాడు. అంతేకాదు.. వాటిపై పట్టు ఉన్న మహిళలు చాలా అదృష్టవంతులు అని పేర్కొన్నాడు. ఎందుకంటే వారికి సత్యమేమిటో అసత్యం ఏమిటో..? తెలిసి ఉంటుంది. అలాంటి స్త్రీలు ఎల్లప్పుడూ కుటుంబ విలువను పెంచుతారు. అదేవిధంగా ఆమెను పెళ్లాడిన వ్యక్తి ఎప్పుడూ సంతోషంగా, ఆర్థికంగా సంపన్నుడిగా ఉంటాడు.
Advertisement
ఇలాంటి స్త్రీల ప్రసంగం చాలా మధురంగా ఉంటుంది అని నమ్ముతాడు. చాణక్యుడు. కుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా సంతోషంగా ఉంటారు. అదే సమయంలో ఆమె తన వినయ స్వభావంతో అందరి హృదయాలను గెలుచుకుంటుంది. అలాంటి స్త్రీలు కుటుంబాన్ని ఐక్యంగా ఉంచుతారు అని తన నీతి గ్రంథంలో పేర్కొన్నాడు. అలాంటి స్త్రీ ఉన్న ఇంట్లో లక్ష్మీ ఎల్లప్పుడూ ఉంటుంది.
సంపదను కూడబెట్టుకోవడంలో నైపుణ్యం కలిగిన స్త్రీలు. కష్ట సమయాల్లో భర్తకు సాయం చేస్తుంటారు. ఎందుకంటే కష్ట సమయాల్లో తాను జమ చేసిన డబ్బుతో భర్తకు సాయ పడుతుంటారు. అందుకే స్త్రీ సంపద కుటుంబానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుందని చాణక్యుడు తన నీతి గ్రంథంలో పేర్కొన్నాడు.
Also Read : జయం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయిందిగా ! హీరోయిన్ కంటే..?