Telugu News » జయం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయిందిగా ! హీరోయిన్ కంటే..?

జయం సినిమాలో నటించిన ఈ చిన్నారి ఇప్పుడు చాలా మారిపోయిందిగా ! హీరోయిన్ కంటే..?

by Anji

కొంత మంది సినిమా ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టి అతి త‌క్కువ స‌మ‌యంలోనే స్టార్ పొజిష‌న్‌ను అనుభ‌విస్తారు. మ‌రికొంద‌రూ ఎన్నో క‌ష్టాలు ప‌డి ఆ పొజిష‌న్ చేరుకుంటూ ఉంటారు. ఎన్నో క‌ష్టాల‌ను ఎదుర్కొని కొంత‌మంది ఆ క‌ష్టాల‌ను భ‌రించ‌లేక, సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌వుతూ ఉంటారు. ముఖ్యంగా కొంత‌మంది సినీ ఇండ‌స్ట్రీలో అవ‌కాశాలు కోల్పోయి, సినీ ఇండ‌స్ట్రీకి దూరం కూడా అవుతుంటారు. ఇలా సినీ ప‌రిశ్ర‌మ‌లో జ‌రిగిన ఎన్నో విష‌యాల‌ను దృష్టిలో పెట్టుకొని త‌న కూతురును సినీ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేయ‌న‌ని చెబుతోంది.

Ads

అయితే త‌న కూతురు కేవ‌లం బాల‌నటిగా న‌టిస్తే చాలు.. ఇక హీరోయిన్‌గా అడుగు పెట్టాల్సిన అవ‌స‌రం లేదని కూడా ఆమె క‌చ్చితంగా చెప్పేసింది. ఒక‌ప్ప‌టి మంచి పేరున్న సీనియ‌ర్ న‌టి జ‌య‌ల‌క్ష్మీ ఆమె న‌టించిన కాలంలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు గాంచి అంద‌రి ప్ర‌శంస‌లు అందుకుని ఈమె త‌న కూతుర్ల‌ను మాత్రం సినిమా రంగంలోకి రానివ్వ‌న‌ని క‌చ్చితంగా చెప్పింది.


నితిన్ స‌దాల కాంబినేష‌న్ లో వ‌చ్చిన జ‌యం సినిమాలో స‌ధా చెల్లెలుగా న‌టించిన యామిని శ్వేత జ‌య‌ల‌క్ష్మి కూతురు.. ఆమె సినిమా త‌రువాత మ‌రి ఇంకే సినిమాలో న‌టించ‌లేదు. ఆమెకు ప్ర‌స్తుత హీరోయిన్ల వ‌య‌స్సు ఉన్న‌ప్ప‌టికీ త‌న‌ను హీరోయిన్ చేసేందుకు జ‌య‌ల‌క్ష్మీ సిద్ధంగా లేన‌ట్టు క‌చ్చితంగా చెప్పేశారు. స‌డ‌న్‌గా జ‌య‌ల‌క్ష్మీ కూతురు విష‌యం తెర‌పైకి రావ‌డానికి ముఖ్య కార‌ణం ఇంత‌కాలం యామిని శ్వేత అమెరికాలో ఉండి వివాహం చేసుకుని కొన్ని కోట్ల‌కు య‌జ‌మానురాలిగా మారింది.


జీవితంలో విజ‌యం వైపు దూసుకెళ్లుతున్న ఆమె తాజాగా త‌న స్వ‌స్థ‌ల‌మైన విజ‌య‌వాడ‌కు మ‌కాం మార్చిన‌ది. అక్క‌డ త‌న వ్యాపారాన్ని వృద్ధి చేసుకుంటూ ఆనందంగా గ‌డుపుతోంది. త‌న తిరిగి రాక‌తో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఓ చిన్న‌పాటి చ‌ర్చ మొద‌లైంది. ఒక‌ప్ప‌టి స‌క్సెస్ పుల్ సినిమాలో న‌టించిన ఈమె క‌చ్చితంగా ఏదో ఒక పాత్రను పోషించ‌బోతున్నారనే అనుమానం ఆమె గురించి మ‌రింత తెలుసుకునేవిధంగా చేసింది.


ఈ విష‌యంపై యామిని త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మి స్పందించి నా కూతుర్లు ఇండ‌స్ట్రీకి హీరోయిన్‌గా పంప‌డం లేద‌ని క‌చ్చితంగా చెప్పింది. సినిమా ఇండ‌స్ట్రీలో నా జీవితాన్ని నిల‌బెట్టుకోవ‌డానికి ఎన్నో బాధ‌లు ప‌డాల్సి వ‌చ్చింది. నా బిడ్డ‌లు ఆ బాధ‌ల‌ను ప‌డ‌కూడ‌దు అని అందుకే సినిమాలవైపు వాళ్ల దృష్టిని మ‌ర‌ల్చి విదేశాల‌కు పంపించాను. కేవ‌లం నా కూతుర్ని బాల‌న‌టిగా మాత్ర‌మే చూడాల‌నుకున్నాను. ఇక మ‌ళ్లీ ఎన్ని అవ‌కాశాలు వ‌చ్చినా నేను ఒప్పుకోలేదు. నా కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో సంతోషంగా గ‌డుపుతోంది. నా కూతుర్లు నా మాట దాట‌నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. క‌న్న త‌ల్లిగా ఇంత‌కంటే నాకేమి కావాల‌ని జ‌య‌ల‌క్ష్మీ పేర్కొన్నారు.

Also Read :  అప్స‌ర‌, నైనాల‌తో క‌లిసి పునీత్ కు నివాళి అర్పించిన ఆర్జీవీ… వీడియో వైరల్…!


You may also like